Nimmala Rama Naidu
Nimmala Rama Naidu : టీడీపీ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శ్మశానాలకు మృతదేహాలను తరలించే కైలాస రథానికి డ్రైవర్‌గా మారారు. ఆకస్మికంగా గుండెపోటుతో మరణించిన వ్యక్తిని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కైలాస రథం నడిపే డ్రైవర్‌కు కోవిడ్ పాజిటివ్ రావడంతో అతడు ఇవాళ డ్యూటీకి రాలేదు. కైలాస రథం నడిపేందుకు వేరే డ్రైవర్లు ఎవరూ ముందుకు రాలేదు.
ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే నిమ్మల స్వయంగా రంగంలోకి దిగారు. కైలాస రథం సేవలకు ఆటంకం కలగకూడదని డ్రైవర్లలో స్ఫూర్తి నింపడానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్వయంగా డ్రైవర్‌గా మారారు. సాటి మనిషిని ఆదుకోవడం, చనిపోయిన వ్యక్తికి సేవ చేయడం పుణ్యమని, మానవ ధర్మాన్ని అందరూ పాటించాలని నిమ్మల తెలిపారు. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించడమే కాదు అంత్యక్రియల్లోనూ ఎమ్మెల్యే నిమ్మల పాల్గొన్నారు.