TDP MP Kesineni Nani : ఎంపీ టికెట్ ఇవ్వకపోతే అక్కడే కూర్చుని సేవచేస్తా : కేశినేని నాని

జీవితాంతం రాజకీయాల్లో ఉండాలనుకునే వ్యక్తిని కాదని అన్నారు. మంచిపనులు ఎవరి చేసినా అభినందిస్తానని తెలిపిన కేశినేను బెజవాడకు ఎవరు మంచి చేస్తే వారితో కలిసి పనిచేస్తానని అది పార్టీలతో సంబంధం లేదన్నారు.

Vijayawada Mp Kesineni Nani : విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంలో ఆయన వ్యవహార శైలితో టీడీపీకి కాస్త తలనొప్పిగా మారారు. తాజాగా నాని మరో అడుగు ముందుకేశి వైసీపీ నేతలను ప్రశంసించటం..వారితో కలిసి ఓ కార్యక్రమానికి హాజరుకావటం ఆసక్తికరంగా మారింది. నా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకావటం తప్పుకాదని అది ప్రభుత్వం కార్యక్రమమే తప్ప పార్టీ కార్యక్రమం కాదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చందర్లపాటు మండలం తోటరావులపాడు గ్రామంలో వాటర్ ట్యాంక్ కార్యక్రమానికి కేశినేని హాజరుకావటం వైసీపీ నేతలపై ప్రశంసలు కురిపించటం హాట్ టాపిక్ గా మారింది. మరి ముఖ్యంగా టీడీపీలో కేశినేని వ్యవహారం తలనొప్పిగా మారింది.

దీనిపై కేశినేని మాట్లాడుతు..నాకు వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా కేశినేని భవనం నుంచి నా సేవల్ని కొనసాగిస్తానని తెలిపారు. జీవితాంతం రాజకీయాల్లో ఉండాలనుకునే వ్యక్తిని కాదని అన్నారు. మంచిపనులు ఎవరి చేసినా అభినందిస్తానని తెలిపిన కేశినేను బెజవాడకు ఎవరు మంచి చేస్తే వారితో కలిసి పనిచేస్తానని అది పార్టీలతో సంబంధం లేదన్నారు. ఎంపీగా ఉన్న నేను పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలనుకుంటే స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు సహకరించాలని..అందుకోసం నేను ఎవరితో అయినా సరే కలిసి పనిచేస్తానని తెలిపారు. బెజవాడ అభివృద్ధి కోసం ముళ్లపందినైనా వాటేసుకుంటా అంటూ కేశినేని నాని  చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Perni Nani : రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా : సీఎం జగన్ సమక్షంలో పేర్ని నాని సంచలన ప్రకటన

కాగా..టీడీపీ ఎంపీ కేశినేని నాని నందిగామ వైఎస్సార్‌సీపీ మొండితోక జగన్మోహనరావుపై ప్రశంసలు కురిపించటం హాట్ టాపిక్ గా మారింది. సడన్‌గా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుపై ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. విజయవాడ అభివృద్ధి కోసం ఎవరితో అయినా సరే కలిసి పనిచేస్తానని ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుంటేనే ఎంపీ నిధులు సద్వినియోగం చేసుకోవచ్చు అని అన్నారు.

నాని చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీ నేతలు, కేడర్‌లో చర్చనీయాంశంగా మారింది. తనకు ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్ లో కూర్చొని విజయవాడ ప్రజలకు సేవ చేస్తానని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. నందిగామ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు తనకు నాలుగేళ్లగా పరిచయం ఉందని..వైఎస్సార్‌సీపీలో ఉన్నా ఎమ్మెల్యేలు ఉదయ భాను, మొండితోక జగన్మోహనరావు సమన్వయం చేసుకోవటం వల్ల ఎంపీ ల్యాండ్ నిధులు ఇచ్చి పనులు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

కాగా ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం తోటరావులపాడులో రూ.47 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంకును ఎంపీ కేశినేని నాని, స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే జగన్మోహన్.. ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ప్రజలకు సేవ చేస్తున్నారని ప్రశంసించారు. తమ పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా కలిసి ముందుకు సాగితేనే అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. తాను ఎంపీ నిధులు కేటాయించినా స్థానిక ఎమ్మెల్యే సహకారం లేనిదే పనులు పూర్తి చేయలేమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చినా తగ్గేదేలేదంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు