Atchannaidu
TDP Leader Atchannaidu : కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఇటీవల జరిగిన డీఎస్పీల బదిలీలపై సీఈసీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో లబ్ధి చేకూరేలా డీఎస్పీల బదిలీలు ఉన్నాయని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉన్నారంటూ 10మంది డీఎస్పీల పేర్లను సీఈసీ దృష్టికి అచ్చెన్నాయుడు తీసుకెళ్లారు. డీఎస్పీలపై ఉన్న అభియోగాలనూ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.
Also Read : HMDA Shiva Balakrishan: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు
వైసీపీకి అనుకూలంగా ఉండే డీఎస్పీలను వివిధ ప్రాంతాల్లో బదిలీ చేశారని, తాజాగా చేపట్టిన 42 మంది డీఎస్పీల బదిలీలపై విచారణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో అచ్చెన్నాయుడు కోరారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించాలని బదిలీ అయిన డీఎస్పీలకు డీజీపీ స్పష్టంగా చెప్పారని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి కలెక్టర్ లక్ష్మీశ కలవడంపైనా అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఆయనను బదిలీ చేసి, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రొటోకాల్ పక్కన పెట్టిన ఎమ్మెల్యేను కలెక్టర్ కలిశారని అన్నారు. లక్ష్మీశ నిష్పక్షపాతంగా ఉంటారనే నమ్మకం మాకు లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఫిర్యాదులో పేర్కొన్న డీఎస్పీల పేర్లు ఇవే..
సుధాకర్ రెడ్డి, రాంబాబు, ఉమా మహేశ్వర రెడ్డి, వీర రాఘవ రెడ్డి, సి. మహేశ్వర్ రెడ్డి, మురళీకృష్ణా రెడ్డి, నారాయణ స్వామి రెడ్డి, శ్రీనాధ్, రాజ్ గోపాల్ రెడ్డి, హనుమంత రావు.