టీడీపీ రెండో లిస్టులో కొత్త ముఖాలా? సీనియర్సా?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందా? లేదా? అన్న సస్పెన్స్‌కు ఇటీవలే తెరపడింది.

TDP

TDP Second list: ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా గురువారం విడుదల కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే తొలి జాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండో జాబితాలో 25 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ఉండనున్నట్లు సమాచారం. కొత్తవారికి టికెట్లు దక్కుతాయా? సీనియర్లకే ప్రాధాన్యం ఇస్తారా? అన్న ఆసక్తి నెలకొంది.

టీడీపీ మొత్తం ఇంకా 50 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నిన్న చంద్రబాబు నాయుడిని పలువురు ఆశావహులు కలిశారు. తొలి జాబితాలో చోటు దక్కని సీనియర్ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీడీపీలో భీమిలి సీటు ఆశిస్తున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయనను చీపురుపల్లిలో పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందా? లేదా? అన్న సస్పెన్స్‌కు ఇటీవలే తెరపడింది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఆ మూడు పార్టీలు నిర్ణయించాయి. పొత్తుల్లో భాగంగా ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలన్న లెక్కపైనా క్లారిటీ వచ్చింది. మరోవైపు, శుక్రవారమే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read : కాకినాడ నుంచి పవన్ కల్యాణ్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి..! బీజేపీ-జనసేన అభ్యర్థులు వీళ్లే..!

ట్రెండింగ్ వార్తలు