Bonda Uma : టీడీపీలో విజయవాడ ‘కాపు మీటింగ్’ కాక..! బొండా రివర్స్ గేర్.. వర్కౌట్ అయ్యేనా మరి..!?
Bonda Uma : గుంటూరు జిల్లాలో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకున్నారు బొండా ఉమా. సభలో పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇక ఇదే సభలో బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.
- Harish Thanniru
- Published on- July 28, 2026 / 01:09 PM IST
Bonda Uma
Bonda Uma : టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బొండా ఉమా ఏపీ పొలిటికల్ డిస్కషన్‌లో సెంటర్ పాయింట్ అయ్యారు. వైసీపీ నేతలతో ఒకే వేదికపై కనిపించడం, ఆ తర్వాత పార్టీ అధిష్ఠానం వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. అయితే ఇది కేవలం ఒకే వేదిక అంశమేనా.? లేక దీని వెనుక రాజకీయ సమీకరణాలు ఉన్నాయా.? మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తిలో ఉన్న బొండా ఉమా.. కాపు సామాజిక వర్గంలో తనుకున్న బలం ఏంటో చూపించే ప్రయత్నం చేశారా.? అనేది చర్చనీయాంశంగా మారింది.
Also Read : Arunachala : అరుణాచలం మోక్షమార్గంలో చిక్కుకుపోయిన ఏపీ మహిళ.. తప్పిన ప్రమాదం.. హెచ్చరిక బోర్డు ఏర్పాటు
గుంటూరు జిల్లాలో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకున్నారు బొండా ఉమా. సభలో పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్నారు. నవ్వులు చిందిస్తూ కనిపించారు. ఇక ఇదే సభలో బొండా ఉమా చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. కాపులలో అసంతృప్తి ఉందన్న బొండా ఉమా.. వారు ఎవరి పక్షం ఉంటే వారిదే విజయం అని చెప్పారు. కాపు ఉద్యమమే 2019లో టీడీపీని ఓడించిందన్న బొండా ఉమా వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఆయన నుంచి వివరణ తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడుకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం ఎక్స్‌ప్లెయినేషన్ ఇవ్వాలని పల్లా, నిమ్మల.. బొండా ఉమాకు సమాచారం అందించినట్లు చెబుతున్నారు. అధిష్ఠానం పెద్దల ముందు బొండా ఉమా ఎలాంటి వాదనను వినిపిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. గతంలో వైసీపీ నేత జక్కంపూడి రాజా నిర్వహించిన మీటింగ్‌కు పలువురు టీడీపీ నేతలు అటెండ్ అయిన విషయాన్ని కూడా బొండా గుర్తు చేసే అవకాశముందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
అయితే బొండా ఉమా వ్యవహారం కేవలం ఒకే వేదికను పంచుకోవడానికే పరిమితం కాదని పార్టీ వర్గాల టాక్. బొండా ఉమా టీడీపీలో సీనియర్ లీడర్. కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించిన వారిలో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే అవకాశం రాకపోవడంపై ఆయన పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారనే చర్చ కూడా ఉంది. ఈ క్రమంలోనే సొంత పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడమే కాకుండా, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ముద్రగడే కారణమంటూ బొండా ఉమా మాట్లాడుకొచ్చారు. టీడీపీ అధిష్టానం పెద్దలకు సన్నిహితుడిగా చెప్పబడే ఎమ్మెల్యే బొండా ఉమా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అయితే చర్చకు దారితీసింది.
విజయవాడలో ముద్రగడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని బొండా ప్రకటించడం కూడా టీడీపీ హైకమాండ్ అసహనం వ్యక్తం చేసినట్లు టాక్. బొండా వైఖరిలో ఎందుకీ మార్పు వచ్చింది.? రీజన్ ఏంటనేది విస్తృత చర్చగా మారింది. అయితే ప్రత్యర్థి పార్టీ నేతలతో క్లోజ్‌గా ఉండటం కంటే.. ఆ సభలో బొండా మాట్లాడిన మాటలే కాక రేపుతున్నాయి. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితోనే ఆయన అలా మాట్లాడారా.? లేక కాపు ఉద్యమ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కావాలనే ఆలోచనతో ఉన్నారా.? అనేది డిస్కషన్ పాయింట్‌గా అవుతోంది.
గతేడాది అసెంబ్లీలో చర్చ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డును టార్గెట్ చేస్తూ..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై బాణాలు ఎక్కుపెట్టారన్న చర్చ జరిగింది. అప్పుడు బొండా తీరును చంద్రబాబు తప్పుబట్టినట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత బొండా యాక్టివ్‌గా కనిపించడం లేదని అంటున్నారు. విజయవాడ నగరంలో కీలక నేతగా ఉన్న నేతకు తనకు తగిన గుర్తింపు లేదన్న భావనలో బొండా ఉన్నట్లు చెబుతున్నారు.
కాపు నేత వంగవీటి రంగా శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన బొండా ఉమా టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. అయితే తనకు మంత్రి పదవి దక్కకపోగా.. వైసీపీ నుంచి వచ్చిన ఓ నేతకు అమాత్య యోగం కల్పించారనేదే బొండా ఉమా అభ్యంతరమంటున్నారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్లాన్‌లో భాగంగానే బొండా టోన్ మార్చినట్లు ఇన్‌సైడ్ టాక్. మరోవైపు బొండా ఉమా కాపు సామాజిక వర్గంలో పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాంటి నేతపై పార్టీ కూడా ఆచితూచి వ్యవహరించే అవకాశమే ఎక్కువగా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.
బొండా ఉమా నుంచి వివరణ కోరడం వెనుక టీడీపీ అధిష్టానం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు చెప్పుకుంటున్నారు. సీరియస్‌గా బిహేవ్ చేసినట్లుగా ఇండికేషన్ పంపకపోతే ఫ్యూచర్‌లో ఇంకొందరు లీడర్లు ఇలాగే మాట్లాడితే సమస్యలు వస్తాయని భావించే బొండాను ఎక్స్‌ప్లెయినేషన్ కోరారని అంటున్నారు. సో బోండా ఎపిసోడ్ టీ కప్పులో తుఫాను లాంటిదేనన్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది.
