ఆర్గానిక్ సాగులో ఆదర్శం : దేశంమెచ్చిన ఆదిలాబాద్ రైతు ఫ్యామిలీ

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఓ యువ జంట వ్యవసాయంలో కొత్త పద్దతులను అనుసరిస్తూ సేంద్రియ వ్యవసాయం చేసేవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్తిగా నేచురల్ పద్దతిలో వ్యవసాయం చేస్తూ అధిక లాబాలు పొందుతున్నారు. వ్యవసాయంలో లాభం రావట్లేదు పట్నం పోయి ఏదో ఓక పని చేసుకుందామనుకునే అనేకమందిలా కాకుండా వ్యవసాయంలో కొత్త పద్ధతులు అనుసరించి లాభాలు గడిస్తున్న ఆ దంపతులలే భోస్లే సంజీవ్(28),రేఖ(26).

ఇంద్రవెల్లి మండలంలోని డొంగార్గాన్ గ్రామంలో  సంజీవ్, రేఖా దంపతులు నివసిస్తున్నారు. 2013వరకు సాధారణ పద్దతిలో వ్యవసాయం చేశాడు. షాపుల నుంచి ఎరువులు, పురుగుల మందులు కొని వ్యవసాయం చేస్తూ జీవించాడు. అయితే ఈ విధంగా వ్యవసాయం చేయడం వల్ల రిస్క్ ఉండటమే కాకుండా, ఎంత కష్టపడినా పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో ఏదో విధంగా వ్యవసాయంలోని లాభాలు గడించాలని డిసైడ్ అయ్యాడు. 10వ తరగతి వరకు చదువుకొన్న సంజీవ్ చిన్నతనం నుంచే చాలా షార్ప్గా ఉండేవాడు. 2013 సమ్మర్ లో ఎరువులు, పురుగుల మందుల వాడకానికి స్వస్థి చెప్పి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లాడు. షాపుల నుంచి విత్తనాలు కొనడానికి బదులుగా తనే విత్తనాలను కూడా స్థానికంగా పండించేవాడు.

సంజీవ్, అతని భార్య ఇద్దరూ కష్టపడి 3వేల 500రూపాయల పెట్టుబడితో కేవలం నాలుగు నెలల్లోనే 6.35క్వింటాళ్ల ఘుగర్ ఫ్రీ రైస్ పంట పండించారు. దీని విలువ మార్కెట్లో 50వేల రూపాయలని ఆ దంపతులు తెలిపారు. ఒక్క ట్రాక్టర్, లేబర్ వేతనం తప్ప తమ వ్యవసాయానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదని సంజీవ్ తెలిపారు. అయితే  పురుగుల మందులను కూడా స్థానిక వనరులను ఉపయోగించుకొని సంజీవ్ తయారుచేయడం మొదలుపెట్టాడు. మొదట్లో తక్కు ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్లమని, ఏకలవ్య ఫౌండేషన్ సహకారంతో తాము ఎక్కువ ఎకరాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నట్లు సంజీవ్ తెలిపారు. ఉల్లి, బంగాళదుంప వంటి కూరనగాయల ధరలు మార్కెట్లో పతనమైనప్పటికీ పంజీవ్ కు పెద్ద నష్టాలు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సాధారణ వ్యవసాయంతో పోల్చి చూస్తే సంజీవ్ చాలా తక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేస్తున్నాడు. అంతేకాకుండా ట్రాక్టర్ చార్జిలకు బదులుగా ఎద్దులను వ్యవసాయానికి ఉపయోగించాలని సంజీవ్ భావిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు