Nagarjunasagar Project : నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంపై ఏపీ ప్రభుత్వాన్ని చర్చలకు పిలిచిన తెలంగాణ ప్రభుత్వం .. కేంద్రం ఆరా..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ పోలీసులు డ్యామ్ వద్దకు చేరుకోవటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితి రెండో రోజు కూడా కొనసాగింది.

High Tension at Nagarjuna Sagar Dam

High Tension at Nagarjuna Sagar Dam : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న సమయంలో నిన్న (నవంబర్ 30,2023) అర్ధరాత్రి ఏపీ పోలీసులు డ్యామ్ వద్దకు చేరుకోవటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీ పోలీసులు సాగర్ రైట్ కెనాల్ కు నీటి విడుదల కోసం రావటం..డ్యామ్‌ 13వ నంబర్ గేటు వరకు చేరుకోవటం..ప్రాజెక్టు వద్ద ఉన్న ఎస్పీఎఫ్‌ పోలీసులపై దాడి చేయటం, సీసీ కెమెరాలు ధ్వంసం చేయటం వంటి ఘటనలతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఏపీ పోలీసుల్ని తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.

ఈక్రమంలో రెండో రోజు కూడా ఏపీ, తెలంగాణ పోలీసులు భారీగా మోహరించి ఉండటంతో సాగర్ వద్ద డ్యామ్ పై ఇంకా అదే హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని చర్చలకు పిలుపునిచ్చింది. దీంతో ఈరోజు మధ్యాహ్నాం ఇరు రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ అధికారులతో పాటు ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే నాగార్జున సాగర్ డ్యామ్ వివాదంపై కేంద్రం ఆరా తీస్తోంది. పరిస్థితులను పరిశీలిస్తోంది.

కాగా.. నిన్న సాగర్ డ్యామ్ వద్దకు భారీగా చేరుకున్న ఏపీ పోలీసులు అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ఫోన్లను లాక్కున్నారు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌పై విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఎస్పీఎఫ్‌ పోలీసులపై ఏపీ పోలీసులు దాడి చేశారు.సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. దీంతో తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు