YS Viveka case : ఎంపీ అవినాశ్ రెడ్డికి ఝలక్ ఇచ్చిన హైకోర్టు .. సీబీఐ విచారణ సహకరించాలని ఆదేశం

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టులో చక్కెదురైంది. అవినాశ్ రెడ్డి వేసిన పిటీషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ..ఈ కేసులో సీబీఐ చేసే విచారణకు సహకరించాలని సూచించింది. ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తంచేయకుండా సీబీఐ విచారణకు హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు ఎంపీ అవినాశ్ రెడ్డికి స్పష్టంచేసింది.

YS Viveka case : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టులో చక్కెదురైంది. అవినాశ్ రెడ్డి వేసిన పిటీషన్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేస్తూ..ఈ కేసులో సీబీఐ చేసే విచారణకు సహకరించాలని సూచించింది. ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తంచేయకుండా సీబీఐ విచారణకు హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు ఎంపీ అవినాశ్ రెడ్డికి స్పష్టంచేసింది. తను విచారణకు పిలవకుండా..తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకు ఆదేశాలు ఇవ్వాలని అశినాశ్ రెడ్డి వినతిని తోసిపుచ్చుతు ఇటువంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టంచేసింది.

అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయద్దన్ని మేము చెప్పలేమన్న హైకోర్టు స్పష్టంచేసింది. ధర్మాసనం ఇచ్చిన ఈ ఆదేశాలతో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి దిమ్మతిరిగిపోయిందనే చెప్పాలి.వివేక హత్యకేసులో ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలనీ సీబీఐకు ఆదేశించింది. అంతేకాకుండా న్యాయవాదికి కనిపించేవిధంగా విచారణ చేయాలని సీబీఐకు సూచించింది.వివేకా హత్య కేసులు తనను విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపైనే అవినాశ్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

 

ట్రెండింగ్ వార్తలు