Telangana Lockdown:ఏపీలో సడలింపులు..తెలంగాణలో పొడిగింపు ? 

కరోనా వైరస్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నంగా స్పందిస్తున్నారు. కరోనా వైరస్ పై లాక్ డౌన్ నుంచి మొదలుకుని సడలింపు వరకు..తీసుకుంటున్న చర్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

Telangana Lockdown: కరోనా వైరస్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నంగా స్పందిస్తున్నారు. కరోనా వైరస్ పై లాక్ డౌన్ నుంచి మొదలుకుని సడలింపు వరకు..తీసుకుంటున్న చర్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. కేంద్రం విధించిన లాక్ డౌన్ కొనసాగించాలని సీఎం కేసీఆర్ కోరిన సంగతి తెలిసిందే. కానీ..ఏపీ సీఎం జగన్ మాత్రం..రెడ్ జోన్ పరిధిలో మాత్రం లాక్ డౌన్ విధించాలని చెప్పారు. అనూహ్యంగా మే 03వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే…ఏపీ రాష్ట్రం కొన్ని సడలింపులను ఇచ్చింది. ఈ మేరకు 2020, ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

గ్రీన్‌ మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కార్యకలాపాలకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పరిశ్రమలు, సంస్థల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అయితే తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. కేంద్రం అనుమతించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం అన్ని మిల్లులు, పాల ఉత్పత్తి కేంద్రాలు, బిస్కట్లు, జ్యూస్‌లు వంటి ఆహార తయారీ కంపెనీలు, మందులు, సబ్బులు, డిటర్జెంట్ కంపెనీలు పనిచేయవచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టు పనులు చేయవచ్చు. భవన నిర్మాణాలు, ఐటీ సంస్థలు సగం మంది సిబ్బందితో పనిచేయవచ్చు. అన్ని రకాల వస్తు రవాణాకు అనుమతిస్తారు. జాతీయ రహదారి పక్కన డాబాలను కూడా నిబంధనల మేరకు నిర్వహించుకోవచ్చు. అయితే ఇందుకు ఆయా సంస్థలన్నీ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే…లాక్ డౌన్ కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం విధించిన గడువు ( మే 03) కాకుండా..మే 07వ తేదీ వరకు కొనసాగించాలని డిసైడ్ తీసుకున్నట్లు టాక్. కొన్ని రంగాలకు మినహాయింపు ఇస్తే…వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక జిల్లాలో లాక్ డౌన్ సడలింపు చేపట్టి..మరో జిల్లాలో కొనసాగించడం కరెక్టు కాదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకొనేందుకు 2020, ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయ్యింది. కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆంక్షల సడలింపు కంటే..మే 03 కాకుండా..మే 07 వరకు పూర్తిస్థాయి…లాక్ డౌన్ కే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని సమాచారం.

Also Read | వేల సంఖ్యలో కోలుకుంటున్న పేషెంట్లు.. కరోనాను ఎదురించడంలో ఇండియా ముందంజ