Telugu States : ప్రైవేటు ఆసుపత్రుల ఫీజుల దందా..తెలుగు ప్రభుత్వాలు సీరియస్

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్‌ రోగుల నుంచి అందినకాడికీ దోచుకుంటున్నాయి. ఒక్కో పేషెంట్‌కు లక్షల బిల్లులు వేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల కాసుల కక్కుర్తిపై రెండు ప్రభుత్వాలు సీరియస్‌ అయ్యాయి. కోవిడ్‌ రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న పలు ఆస్పత్రులపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది.

Jagan And Kcr

Private Hospitals : తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్‌ రోగుల నుంచి అందినకాడికీ దోచుకుంటున్నాయి. ఒక్కో పేషెంట్‌కు లక్షల బిల్లులు వేస్తూ నిలువుదోపిడీ చేస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌ ఆస్పత్రుల కాసుల కక్కుర్తిపై రెండు ప్రభుత్వాలు సీరియస్‌ అయ్యాయి. కోవిడ్‌ రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న పలు ఆస్పత్రులపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. కృష్ణా జిల్లాలో 52 ఆస్పత్రులకు భారీగా విధించింది. వీటి నుంచి ఏకంగా రూ. 3 కోట్ల 61 లక్షలు వసూలు చేసింది. మరికొన్ని ఆస్పత్రుల్లో టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. జి.కొండూరులో అనుమతులు లేకుండా కోవిడ్‌ ఆస్పత్రులనూ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.

అటు విశాఖ జిల్లాలోనూ వైద్య అధికారులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు భారీగా ఫైన్‌ విధిస్తున్నారు. జిల్లాలోని 25 ఆస్పత్రులకు 52 లక్షలు జరిమానా విధించింది. కోవిడ్‌ ఆదేశాలను అమలు చేయనుందుకు ఈ ఫైన్‌ వేసినట్టు అధికారులు వెల్లడించారు. తెలంగాణలోనూ 64కి పైగా ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది వైద్యారోగ్యశాఖ. 64 ప్రయివేటు ఆస్పత్రుల‌పై 88 ఫిర్యాదులు వ‌చ్చాయి. ఫిర్యాదులు ప‌రిశీలించి ఆయా ఆస్పత్రుల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశామ‌న్నారు ప‌బ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు. ఆయా ఆస్పత్రులు 24 గంట‌ల నుంచి 48 గంట‌ల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డీహెచ్ సూచించారు.

Read More : Sudheer Babu: కొండపైకి కారును ఎక్కించాలి.. సుధీర్ బాబు కఠినమైన వర్క్ ఔట్స్!