Sudheer Babu: కొండపైకి కారును ఎక్కించాలి.. సుధీర్ బాబు కఠినమైన వర్క్ ఔట్స్!

ఒకప్పుడు మన సినిమా హీరోలు వేరు.. ఇప్పుడు వేరు. అప్పట్లో ఏ హాలీవుడ్ లోనో సిక్స్ ప్యాక్ హీరోలుంటే.. ఇప్పుడు దాదాపుగా మన హీరోలందరూ చొక్కా కింద సిక్స్ ప్యాక్ మైంటైన్ చేస్తున్నారు.

Sudheer Babu: కొండపైకి కారును ఎక్కించాలి.. సుధీర్ బాబు కఠినమైన వర్క్ ఔట్స్!

Sudheer Babu

Sudheer Babu: ఒకప్పుడు మన సినిమా హీరోలు వేరు.. ఇప్పుడు వేరు. అప్పట్లో ఏ హాలీవుడ్ లోనో సిక్స్ ప్యాక్ హీరోలుంటే.. ఇప్పుడు దాదాపుగా మన హీరోలందరూ చొక్కా కింద సిక్స్ ప్యాక్ మైంటైన్ చేస్తున్నారు. కొందరు ఆల్రెడీ సిక్స్ ప్యాక్ చేసి వదిలేసినా ఫిట్ నెస్ విషయంలో మాత్రం జాగ్రత్తగానే ఉంటున్నారు. అయితే.. మహేష్ బాబుకు స్వయానా బావ.. సూపర్ కృష్ణకు అల్లుడైన సుధీర్ బాబు మాత్రం అందరికంటే కాస్త భిన్నంగా ఫిట్నెస్ ఫ్రీక్ గా కనిపిస్తుంటాడు. అందుకు కఠినమైన కసరత్తులు చేస్తూ ఎప్పటికప్పుడు తన బాడీని పర్ఫెక్ట్ షేప్ లో పెడుతున్నాడు.

సుధీర్ చాలా కాలంగా సిక్స్ ప్యాక్ మైంటైన్ చేస్తున్నాడు. మిగతా హీరోలందరూ ఏదో ఒక సినిమా కోసం సిక్స్ ప్యాక్ పెంచి ఆ తర్వాత ఫిట్నెస్ ఉంటే చాల్లే అనుకోని కాస్త రిలాక్స్ అవుతుండగా సుధీర్ మాత్రం అదే సిక్స్ ప్యాక్ మైంటైన్ చేస్తూ వాహ్ అనిపిస్తున్నాడు. రోడ్డుపై వర్కౌట్స్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా. అది కూడా కారుతో సామర్ధ్యాన్ని పెంచుకోవడం చూశారా.. మన సుధీర్ బాబు అది కూడా వదలడం లేదు. టాలీవుడ్ హీరోలు ఎవరు ట్రై చేయని విధంగా సుధీర్ బాబు టన్నుల్లో ఉన్న తన కారును కొండ మీదకి తోస్తూ చెమటోడుస్తున్నాడు.

తన కారు బ్యాట్ రైడర్ ని పుష్ చేస్తూ వాహనాన్ని కొండపైకి ఎక్కించి తన బాడీకి ఫ్యూయల్ బూస్ట్ ఇస్తున్నాడు. ట్రైనర్ సలహాలతో సుధీర్ ఈ కార్ పుషింగ్ వర్క్ ఔట్స్ చేస్తుండగా ట్రైనర్ పక్కనే ఉంటూ మెళుకువలు ఇచ్చి సుధీర్ కు సహాయపడుతుంటాడు. గత ఏడాదికి పైగా సుధీర్ ఇదే తరహా వర్క్ ఔట్స్ చేస్తూ తన దేహాన్ని పలకలుగా మార్చుకుంటున్నాడు. ఇదేం అంత సులభమైన విషయం కాదు.. రెండు టన్నులకు పైగా బరువుండే ఫోర్డ్ ఎస్యూవీని కొండపైకి నెట్టడం అంటే చేసే వారికే తెలుస్తుంది ఆ కష్టమేంటో.. సుధీర్ పడే ఆ కష్టాలేంటో మీరు చూడాలంటే ఆ వీడియోను ఓ లుక్కేసుకోవాల్సిందే!