Telugu Students Ukraine : బాంబుల మోత వినిపిస్తోంది, భయంగా ఉంది- చంద్రబాబుతో యుక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థి

మేమున్న ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి బాంబుల మోత వినిపిస్తోంది. సమీపంలో సురక్షిత ప్రాంతం ఎక్కడో కూడా తెలియక ఆందోళన చెందుతున్నాం..

Telugu Students Ukraine : యుక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూమ్ లో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, మిమ్మల్ని సురక్షితంగా భారత్ కు తీసుకొస్తామని వారికి భరోసా ఇచ్చారు చంద్రబాబు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను సాయి కమలేష్ అనే విద్యార్థి చంద్రబాబుకి వివరించారు. ” మేమున్న ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి బాంబుల మోత వినిపిస్తోంది. సమీపంలో సురక్షిత ప్రాంతం ఎక్కడో కూడా తెలియక ఆందోళన చెందుతున్నాం” అని యుక్రెయిన్ లో స్థానిక పరిస్థితులను జూమ్ ద్వారా చంద్రబాబుకు వివరించాడు.

Telugu Students Explain Situation In Ukraine To Chandrababu Naidu

మేము దన్భాగ్ ఏరియాలో నివసిస్తున్నాం. ఇక్కడ తెలుగువారు తక్కువే ఉన్నారు. బయటకెళ్లే పరిస్థితి లేదు. ఇక్కడి పరిస్థితులు ప్రమాదకరంగానే ఉన్నాయి. భారత్ ఎంబెసీ నుంచి అధికారిక సమాచారం వస్తేనే ఏదైనా నిర్ణయం తీసుకోగలం. అనధికారిక సమాచారంతో మేమేదైనా నిర్ణయం తీసుకుంటే మరిన్ని ఇబ్బందులు పడతాం. ప్రతి ఇంటికి బంకర్ సదుపాయం ఉన్నందున వీలైనంతగా బంకర్ లో ఉండటమే ఉత్తమం. మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని జాగ్వర్ కుమార్ అనే స్థానిక విద్యార్థి చంద్రబాబుతో జూమ్ లో మాట్లాడారు.

CM Jagan : యుక్రెయిన్‌లోని తెలుగు వారి కోసం అధికారుల‌ను నియ‌మించిన సీఎం జగన్

యుక్రెయిన్ లో చిక్కుకున్న ఆంధ్రులకు టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. అక్కడి తెలుగు విద్యార్థులతో చంద్రబాబు జూమ్ లో సమావేశం అయ్యారు. తెలుగు విద్యార్థులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. తెలుగు విద్యార్థులంతా ఐక్యంగా ఉండటంతో పాటు తటస్థంగా ఉండటం ఎంతో మంచిదన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమయస్ఫూర్తితో వ్యవహరించటం ఎంతో కీలకం అని చెప్పారు. పాస్ పోర్ట్ సహా ఇతర ఆధారాలు ఎప్పుడూ వెంటే ఉంచుకోవాలని వారి సూచించారు చంద్రబాబు.

టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటుందని చంద్రబాబు వారితో చెప్పారు. రాబోయే 2-3 రోజులు ఎంతో కీలకం అన్న చంద్రబాబు.. పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీరు ఎవరికీ లక్ష్యం కాదు కాబట్టి మీరు సురక్షితంగా ఉండొచ్చని చంద్రబాబు వారితో అన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి మీ యోగక్షేమాల కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు చంద్రబాబు.

Telugu Students Explain Situation In Ukraine To Chandrababu Naidu

యుక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అక్కడ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది తెలుగువారు యుక్రెయిన్ లో చిక్కుకుపోయారు. భారత్ కు తిరిగి వచ్చే పరిస్థితి లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుంటూ బతుకుతున్నారు.

Ukraine Tension : యుక్రెయిన్‌లో 18వేల మంది భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు : విదేశాంగ శాఖ

యుక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా భారత్ కు తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం జగన్ సైతం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కు జగన్ ఫోన్ చేశారు. యుక్రెయిన్ లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్న విషయాన్ని జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. వారిని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. అందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జగన్ తో చెప్పారు కేంద్రమంత్రి జైశంకర్. ఉక్రెయిన్ పొరుగున ఉన్న దేశాల మీదుగా ప్రత్యేక విమానాల్లో అందరినీ తీసుకొస్తామని ఆయన తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు