Anita
Vangalapudi Anita Fire On YCP Casino : క్యాసినో అనే మాట ..తెలుగునాట తీవ్ర విమర్శలు రేకెత్తిస్తోంది. సంక్రాంతి పండుగకు కోడి పందాలు..ఎడ్ల పందాలతో పాటు వైసీపీ నేతలు క్యాసినో నిర్వహించారనే విమర్శలు ఏపీలో హీటెక్కిస్తున్నాయి. ఆ వేడి ఏమాత్రం చల్లారటంలేదు. ఈ క్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మరోసారి వైసీపీ నేతలపై మండిపడ్డారు. ‘‘ఆడబిడ్డలతో క్యాసినో నిర్వహించిన మంత్రులు మనుషులా కాలకేయులా? అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నించారు అనిత.ఆడబిడ్డలపై దాడులు జగన్ రెడ్డి పాలనలో సర్వసాధారణమయ్యాయని విమర్శలు గుప్పించారు.
జగన్ రెడ్డి పాలనలో అక్రమాలు, అరాచకాలు, ఆడబిడ్డలపై దాడులు హింసలు సర్వసాధారణమైపోయాయని అనిత తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళలంటే గౌరవించే టీడీపీ పార్టీ మహిళల్లో ధైర్యం నింపటానికి సంకల్ప దీక్ష చేపట్టామని అనిత ఈ సందర్భంగా తెలిపారు. మహిళా సాధికారిత కోసం టీడీపీ పొదుపు సంఘాలను అమలులోకి తీసుకొచ్చిందని..బ్యాంకుల ద్వారా మహిళలకు లోన్లు ఇప్పించి కుటుంబానికి మహిళలు అండగా నిలిచేందుకు పోత్సహించిందని ఈ సందర్భంగా అనిత మరోసారి గుర్తు చేశారు.
కానీ నేడు జగన్ రెడ్డి పాలనలో ఆడవారి భద్రత అనేదే లేకుండా భయం భయంగా జీవిస్తున్నారని..ఈ క్రమంలో డబ్బులు కూడా కొట్టేసిన దొంగ జగన్ రెడ్డి జగన్ రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని హెచ్చరించారు అనిత.సుచరిత కేవలం అలకార ప్రాయంగా మాత్రమే హోమంత్రిగా ఉన్నారని..గన్ మెన్ కోసమే సుచరిత కు హొంమంత్రి పదవి అని మహిళలకు ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే హోమంత్రిగా ఉన్న సుచరిత మాత్రం ఏమాత్రం స్పందించకుండా కేవలం గన్ మెన్ కోసమే సుచరత హోమంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
కాగా..టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగు మహిళా ఆధ్వర్యంలో ‘తెదేపా నారీ సంకల్ప దీక్ష’ ప్రారంభమైంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిరసనగా వంగలపూడి అనిత ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగుతోంది. మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా ఈ దీక్ష చేపట్టారు. నిరసన దీక్షలో తెలుగు మహిళ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వైకాపా పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని వంగలపూడి అనిత తీవ్రంగా విమర్శించారు. విజయవాడలో 9th Class బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరమని, నిందితుడు వినోద్ జైన్‌ను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఘటన విషయం తెలిసిన వెంటనే వినోద్ జైన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని తెలిపారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలనూ రాజకీయ లబ్ధికి వాడుకునే రాబందులు వైకాపా నేతలు అన్న అనిత…,నిందితుడు వినోద్ జైన్ మంత్రి వెల్లింపల్లికి ప్రధాన అనుచరుడని వెల్లడించారు.
వైసీపీ టీడీపీపై ఆరోపణలు చేయటం నిందలు మోపడం ఆపి మహిళలకు రక్షణ కల్పించడంపై పాలకులు దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. బాలికను రేప్ చేసిన వైకాపా నేత భూశంకర్ ను దిశా చట్టం కింద ఎందుకు ఉరితీయలేదు? అని అనితి ప్రశ్నించారు.