Kuppam : కుప్పంలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలు లాక్కుపోయిన గుర్తు తెలియని వ్యక్తులు

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్ధి నామినేషన్ల పేపర్లను కొంతమందివ్యక్తులు లాక్కుపోవటంతో ఉద్రిక్తత నెలకొంది.

Tension In Kuppam Municipality Election Nominations

Tension in Kuppam Municipality Election Nominations చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల వేస్తున్న క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నుంచి పోటీ చేయటానికి ఓ వ్యక్తి నామినేషన్‌ వేయటానికి వెళుతుండగా అతని చేతిలోంచి నామినేషన్ల పేపర్లకు కొంతమంది వ్యక్తులు లాక్కుపోయారు. అతనిపై దాడి చేసిన మరీ పేపర్లను లాక్కుపోయారని వాపోయాడు బాధితుడు.

కాగా కుప్పంలో మున్సిపల్ ఎన్నికల జరుగనున్న క్రమంలో నామినేషన్లు వేస్తున్నారు పలువురు అభ్యర్ధులు. నామినేషన్లకు ఈరోజే చివరి రోజు కావటంతో ఆయా పార్టీల తరపున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో 14వ వార్డుకు చెందిన వెంకటేశ్‌ అనే వ్యక్తి నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా.. అతడి వద్ద నుంచి కొంతమంది వ్యక్తులు నామినేషన్‌ పత్రాలను గుంజుకుని పోయారు. ఈక్రమంలో పెనుగులాట జరగగా సదరు వ్యక్తులు వెకటేశ్ పై దాడి చేసి మరీ పత్రాలను లాక్కుపోయారు. ఈ ఘర్షణలో వెంకటేశ్‌ చేతికి గాయమైంది.

కాగా బాధితుడు వెంకటేశ్ గతంలో కుప్పం సర్పంచ్ గా, ఎంపిపిగా పనిచేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.మరోవైపు కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు టీడీపీ, వైపీసీ నేతలు పోటా పోటీగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ పురపాలిక ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. పట్టు నిలుపుకోవాలని తెదేపా, పాగా వేయాలని వైకాపా ప్రయత్నాలు చేస్తున్నాయి.