Tirupati ByPoll : చంద్రబాబు ప్రచారంలో ఉద్రిక్తత.. రాళ్లు విసిరారంటూ రోడ్డుపై బైఠాయింపు

తిరుపతిలోని కృష్ణాపురం ఆన వద్ద సాయంత్రం బాబు సభ నిర్వహిస్తున్నారు. అయితే..బాబు ప్రసంగిస్తున్న సమయంలో..ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

Chandrababu Naidu :  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారం పీక్ స్టేజ్ కి చేరుకొంటోంది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే..2021, ఏప్రిల్ 12వ తేదీ సోమవారం సాయంత్రం తిరుపతిలోని కృష్ణాపురం ఆన వద్ద సాయంత్రం బాబు సభ నిర్వహిస్తున్నారు. అయితే..బాబు ప్రసంగిస్తున్న సమయంలో..ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తమపైన రాళ్లు పడుతున్నాయని బాబు దృష్టికి తీసుకొచ్చారు కార్యకర్తలు.

ప్రసంగం ఆపేసి..బాబు వాహనంపై నుంచే విచారించారు. ఎవరిపైనా రాళ్లు పడితే..తన వాహనంపైకి రావాలని సూచించారు. దీంతో ఓ కార్యకర్త పైకి వచ్చి…రాళ్లు పడ్డాయని చూపిస్తూ..తెలిపారు. తమపైనా కూడా రాళ్లు పడ్డాయని పలువురు కార్యకర్తలు వెల్లడించారు. ఇక్కడ పోలీసులు ఎవరైనా ఉన్నారా అని మైక్ లో ప్రశ్నించారు బాబు. అక్కడ ఎలాంటి స్పందన రాకపోవడం, పోలీసులు ఎవరూ లేరని కార్యకర్తలు చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాబు..వాహనంపై నుంచి కిందకు దిగి..రోడ్డుపైనే బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకున్నారు. బాబుకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాళ్లు విసిరిన వారిని వెంటనే పట్టుకోవాలని బాబు డిమాండ్ చేస్తున్నారు.

వైసీపీ ఇలాంటి చర్యలకు దిగుతోందని, కనీసం సభకు భద్రత కల్పించరా అంటూ ప్రశ్నించారు. పోలీసుల చర్యను ఖండిస్తున్నట్లు కార్యకర్తలు నినదించారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని, టీడీపీ పార్టీ ఎన్నో సంక్షోభాలు చూసిందన్నారు బాబు. వైసీపీ పార్టీని ఓడించే సత్తా కేవలం టీడీపీకి మాత్రమే ఉందని, అనైక్యత సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Read More : AP Covid Updates : ఏపీలో కరోనా కల్లోలం.. మరోసారి 3వేలకు పైగా కొత్త కేసులు.. ఆ జిల్లాలో ఉగ్రరూపం

ట్రెండింగ్ వార్తలు