Chittoor District : రామకుప్పంలో ఉద్రిక్తత-అంబేద్కర్, ఉయ్యాలవాడ విగ్రహాల స్ధాపనలో వివాదం

చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  గత నెల 22న తొలగించిన అంబేద్కర్ స్థూపం వద్దే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటుకు రెడ్డి సామాజిరక వర్గానికి చెందిన వ్యక్త

Ramakuppam

Chittoor District :  చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  గత నెల 22న తొలగించిన అంబేద్కర్ స్థూపం వద్దే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటుకు రెడ్డి సామాజిక  వర్గానికి చెందిన వ్యక్తులు ఈ రోజు  ప్రయత్నించారు. కానీ…ఇది వరకే అక్కడ ఎస్సీ సంఘం అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించింది.

కాగా..అంబేద్కర్ విగ్రహం వద్ద ఉయ్యాలవాడ విగ్రహం ఏర్పాటు చేసేందుకు రెడ్డి సంఘం ప్రతినిధులు  ప్రయత్నించగా ఎస్సీ వర్గీయులు అడ్డుకున్నారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు ఇరువర్గాలను శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.

Also Read :Car Fires,Man Burnt Alive : కారులో మంటలు-నెల్లూరులో వ్యక్తి సజీవదహనం

చివరికి పంతం  నెగ్గించుకున్న రెడ్డి సంఘం  ప్రతినిధులు అక్కడ ఉయ్యాలవాడ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ జరిపారు. సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన ఇతర దళిత సంఘాల ప్రతినిధులు నిరసన కొనసాగిస్తున్నారు.