Car Fires,Man Burnt Alive : కారులో మంటలు-నెల్లూరులో వ్యక్తి సజీవదహనం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి రైల్వే గేటు సమీపంలో శనివారం ఒక కారు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవ్యక్తి సజీవ దహనం అయ్యాడు.

Car Fires,Man Burnt Alive : కారులో మంటలు-నెల్లూరులో వ్యక్తి సజీవదహనం

Nellore car on fire

Car Fires,Man Burnt Alive : నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి రైల్వే గేటు సమీపంలో శనివారం ఒక కారు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవ్యక్తి సజీవ దహనం అయ్యాడు. స్ధానికుల ఇచ్చిన సమాచారంతో ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయగా…. అందులో కాలిపోయి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇది హత్యా?  లేక ఆత్మహత్య?  అనేకోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.  AP 28 DU 5499 నెంబరు గల ఈ కారు తెలంగాణలోని రంగారెడ్డిజిల్లాకు చెందినదిగా గుర్తించారు. ఈకారును సెకండ్ సేల్స్ లో బుచ్చిరెడ్డిపాళేనికి   చెందిన మాలేటిపాటి మల్లికార్జున్‌(45) అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు తెలుసుకున్నారు.

మల్లికార్జున్ గత కొన్నేళ్లుగా ఆర్‌కే జిరాక్స్‌ పేరుతో షాపు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని విజయ మహాల్‌ రైల్వేగేటు ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి వెళుతున్నట్లు చెప్పి షాపు నుంచి కారులో బయలుదేరారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గొలగమూడి రైల్వేగేటు సమీపంలో మొగల్‌  చెరువుకు వెళ్లే మార్గంలోని ఖాళీ ప్రదేశానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు.. ఈదుర్ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు మల్లికార్జున్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాం వద్దకు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మల్లికార్జున్ సతీమణి శ్రావణి సంఘటన స్థలంలో సొమ్మసిల్లారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆస్తి పంపకాల విషయంలో గత కొంతకాలంగా వివాదాలు తలెత్తినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
Also Read : Vizianagaram : విజయనగరంలో ఆర్‌ఐ ఆత్మహత్య
ఆదివారం ఉదయం ఘటనా స్ధలంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో డాక్టర్ వెంకటేశ్వర్లు, ఫోరెన్సిక్ అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల డీఎన్ఎ శాంపిల్స్ తీసుకుని మంగళగిరిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మల్లికార్జున్ బ్రతికుండగానే దహనo చేసుకున్నట్లు ఉందని పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చే సరికి 2,3 నెలలు పడుతుందని….శరీరంలో విషం తాలూకు అవశేషాలు ఏమైనా ఉన్నాయా ? లేదా ? అన్నది ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలాల్సి ఉందని ఆయన తెలిపారు.