Road Accident : అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద ఆటోను జీపు ఢీకొంది.
- kunduru Vinod
- Published On : December 6, 2021 / 12:05 PM IST
Road Accident
Road Accident : చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన మరువకముందే అనంతపురం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద ఆటోను జీపు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
చదవండి : Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకొని ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
చదవండి : Road Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
