TTD Board: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. బ్రహ్మోత్సవాల కోసం భారీ ఏర్పాట్లు.. టీటీడీ కీలక సూచనలు
కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD Board)అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేస్తోంది.
TTD key guidelines for devotees about Tirumala Salakatla Brahmotsavam and
- శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
- ప్రత్యేక దర్శనాలు, వాహనాల నిషేధం
- సీఎం చేతుల మీదుగా ప్రాజెక్టులు
TTD Board: కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది అధికమాసం కారణంగా టీటీడీ (TTD Board)రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనుండగా, సెప్టెంబర్ 14న అంకురార్పణతో వేడుకలు ప్రారంభమై, సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు ప్రధాన ఉత్సవాలు సాగనున్నాయి. మొదటి రోజైన సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయగా, గరుడసేవ (సెప్టెంబర్ 19) సందర్భంగా ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించింది.
ముఖ్య ఘట్టాల పట్టిక, భక్తుల సౌకర్యార్థం సేవలు:
ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 15న ధ్వజారోహణం, 19న గరుడ వాహనం, 22న రథోత్సవం, 23న చక్రస్నానం ఘనంగా జరగనున్నాయి. వాహన సేవలు రోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు కొనసాగుతాయి. మాడ వీధులు, క్యూలైన్లలో నిరంతర అన్నప్రసాద వితరణతో పాటు పుష్కరిణి మరమ్మతులు, భద్రతా గ్రిల్స్ ఏర్పాటు పనులను అధికారులు వేగవంతం చేశారు.
రూ.145 కోట్లతో మ్యూజియం.. సీఎం చేతుల మీదుగా ప్రాజెక్టులు:
బ్రహ్మోత్సవాల సందర్భంగా రూ.145 కోట్ల విరాళాలతో 3D, 7D సాంకేతికతతో అత్యాధునికంగా పునరుద్ధరించిన ఎస్వీ మ్యూజియాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీంతో పాటు తిరుమల చెత్త సమస్య పరిష్కారానికి రూ.12 కోట్లతో ఐఓసీఎల్ నిర్మించిన బయోగ్యాస్ ప్లాంట్, రిలయన్స్ సంస్థ విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులను కూడా సీఎం ప్రారంభించనున్నారు. టీటీడీ అదనపు ఈవో, అధికారుల పర్యవేక్షణలో మౌలిక వసతులు, లడ్డూ నిల్వలు సిద్ధమవుతున్నాయి.
