Road Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జగిత్యాల-కోరుట్ల హైవేపై మోహన్ రావు పేట వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది.

Road Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Bus (1)

Three killed in a road accident : జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. జగిత్యాల-కోరుట్ల హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మోహన్ రావు పేట వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు అయ్యాయి.

మృతులంతా కోరుట్ల మండలం మోమిన్ పూర్ కు చెందిన వారుగా గుర్తించారు. ఇద్దరు చిన్నారులతోపాటు డ్రైవర్ బాబు కూడా మృతి చెందారు. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పిల్లల తల్లీదండ్రులతోపాటు మరొక మహిళ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. వీరిలో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బాలుడి తలకు బలమైన గాయం అయింది.

Army Fire : ఉగ్రవాదులనుకుని కూలీలపై ఆర్మీ కాల్పులు.. 11 మంది మృతి

మృతి చెందిన బాలుర తల్లీదండ్రులు మాత్రం ఇంకా షాక్ లోనే ఉన్నారు. పిల్లలు మృతి చెందిన విషయం కూడా వారికి తెలియలేదు. వారి కుటుంబ సభ్యులకు ఇప్పుడిప్పుడే సమాచారం అందింది. హైదరాబాద్ నుంచి కోరుట్ల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మెట్ పల్లి నుంచి జగిత్యాల వైపు ఆర్టీసీ బస్సు వెళ్తోంది.

ఇటు కోరుట్ల వైపు వెళ్తోన్న ఇన్నోవా కారు అతి వేగంగా వెళ్లి.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారే కాకుండా బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిని కూడా జగిత్యాల ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Warangal : ఆరోగ్య ప్రధాయినిగా ఓరుగల్లు.. 2 వేల పడకలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా వీరిలో ముగ్గురు మృతి చెందారు. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. తల్లీదండ్రులకు కూడా బలమైన గాయలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.