Warangal : ఆరోగ్య ప్రదాయినిగా ఓరుగల్లు.. 2 వేల పడకలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

తెలంగాణకు ఆరోగ్య ప్రధాయినిగా ఓరుగల్లు వెలిగిపోనుంది. వరంగల్‌ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం కానుంది. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది.

Warangal : ఆరోగ్య ప్రదాయినిగా ఓరుగల్లు.. 2 వేల పడకలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

Warangal

Multi Specialty Hospital in Warangal : తెలంగాణకు ఆరోగ్య ప్రధాయినిగా ఓరుగల్లు వెలిగిపోనుంది. వరంగల్‌ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం కానుంది. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి నిధుల కోసం ప్రభుత్వం జీవో జారీ చేసింది. 24 అంతస్థులతో భనవ సముదాయం నిర్మించనున్నారు. ఇందులో 2 వేల పడకలు ఏర్పాటు చేయనున్నారు.

మొత్తం 15 ఎకరాల్లో 11 వందల కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టనున్నారు. 215.35 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మాణం కోసం స్థలం కేటాయించింది ప్రభుత్వం. స్పెషాలిటీ వైద్యం కోసం 12 వందల పడకలు ఏర్పాటు చేస్తారు. ఇందులో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ENT, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాలు ఉంటాయి. సూపర్ స్పెషాలిటీల కోసం 8 వందల పడకలు ఉంటాయి.

Renault‌ Bumper Offer : రెనాల్ట్‌ బంపర్‌ ఆఫర్‌.. కార్లపై భారీ డిస్కౌంట్లు

వీటిలో అంకాలజి సహా, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ సేవలు అందిస్తారు. కిడ్నీ, కాలేయం వంటి అవయవ మార్పిడికి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలో కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైద్య కళాశాలను కూడా ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేయనున్నారు.