నాకు ప్రాణహాని ఉంది, ఆ ఆడియో నాది కాదు.. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

  • Publish Date - November 7, 2020 / 04:51 PM IST

tadikonda mla undavalli sridevi: మీడియాలో ప్రసారం అవుతున్న ఆడియో తనది కాదని గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు. తన ఆడియోలను మార్ఫింగ్ చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని శ్రీదేవి ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు సందీప్, నరేశ్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని శ్రీదేవి అన్నారు.


ఆ ఇద్దరు తప్పు చేయడంతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని వారిని సస్పెండ్ చేశామన్నారు శ్రీదేవి. పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు, కేసులు నమోదు చేసినందుకు ఆ ఇద్దరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి వాపోయారు. సందీప్, నరేశ్ నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు శ్రీదేవి. ఆ ఇద్దరి వెనుక ఇసుక మాఫియా ఉందన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రపై పూర్తి విచారణ చేయాలని పోలీసులను కోరారు ఎమ్మెల్యే శ్రీదేవి.