కమాండ్ కంట్రోల్ రూమ్ విశాఖలో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
- bheemraj
- Published On : March 3, 2021 / 10:07 PM IST
command control room : విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించాలన్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. విజయవాడలో కాకుండా విశాఖలో నిర్మించాలని నిర్ణయించింది.
ఇప్పటికే వైజాగ్‌ను పరిపాలనా రాజధానిగా సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో.. అక్కడ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు కేటాయించిన రూ.13.8కోట్ల నిధులను.. విశాఖలో నిర్మించబోయే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు బదలాయించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
