Srisailam
biggest danger missed : కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ఆలయంలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. స్వామివారిని దర్శించుకునేందుకు దక్షిణ మాడవీధిలో క్యూలో నిలబడ్డ భక్తుల వైపు లారీ అదుపు తప్పి దూసుకొచ్చింది. భక్తులు కేకలు వేయడంతో సిబ్బంది అప్రమత్తమైంది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టింది.
ఆలయంలో తయారు చేసే లడ్డు పదార్థానికి కావాల్సిన నెయ్యి క్యాన్లను తీసుకొచ్చిన లారీకి బ్రేక్ ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా లారీ భక్తుల వైపు దూసుకొచ్చింది. ఇది గమనించిన ఆలయ, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై లారీకి అడ్డంగా రాళ్లు వేసి ఆపేశారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.