Constable : మిస్టరీగా మారిన కానిస్టేబుల్ మిస్సింగ్

డిసెంబర్ 30న శ్రీనివాసనాయుడు తన స్వగ్రామం గరుగుబిల్లి మండలం నందివాని వలసకు వచ్చాడు. తన స్వగ్రామం నుండి కురుపాం మండలం కస్పా గధబవలసలో భూమి కొనుగోలుకు వెళ్లి బేరసారాలు చేశాడు.

Missing

Constable Srinivasanaidu disappearance : విజయనగరం జిల్లాలో కానిస్టేబుల్ డోకల శ్రీనివాసనాయుడు అదృశ్యం మిస్ట రీగా మారింది. విశాఖ ఎంపీవీ క్రైమ్ స్టేషన్ లో శ్రీనివాసనాయుడు కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 30న శ్రీనివాసనాయుడు తన స్వగ్రామం గరుగుబిల్లి మండలం నందివాని వలసకు వచ్చాడు. తన స్వగ్రామం నుండి కురుపాం మండలం కస్పా గధబవలసలో భూమి కొనుగోలుకు వెళ్లి బేరసారాలు చేశాడు.

తిరిగి వెళ్తూ మార్గంమధ్యలో శ్రీనివాసనాయుడు మిస్సయ్యాడు. కానిస్టేబుల్ మిస్సింగ్ సంచలనంగా మారింది. అతను అదృశ్యమవ్వడంతో కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఆచూకీ కోసం పోలీసులు మూడు బృందాలతో గాలింపు చేపట్టారు.