AP Parishad Elections : ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు..

స్వల్ప ఘర్షణలు మినహా ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది.

The MPTC and ZPTC elections : స్వల్ప ఘర్షణలు మినహా ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5గంటల వరకు 47.42 శాతం పోలింగ్ నమోదైంది. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో 2 గంటలకే పోలింగ్ ముగిసింది. అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. ఏపీ వ్యాప్తంగా 515 జడ్పీటీసీలు, 7వేల 220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది.

సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ బూత్‌లకు వచ్చినవారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. 660 జెడ్పీటీసీలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా… మొత్తం 126 ఏకగ్రీవమయ్యాయి. పలు కారణాలతో 8 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడంలేదు.

గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు పోటీలో ఉన్న 11మంది అభ్యర్థులు మరణించారు. మిగిలిన 515 జెడ్పీటీసీ స్థానాలకు 2వేల 58 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 10వేల 047 ఎంపీటీసీలకు గాను 2వేల 371 స్థానాలు ఏకగ్రీవమయ్యా యి. 375 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించడం లేదు. 81 మంది అభ్యర్థులు మరణించడంతో మిగిలిన 7వేల 220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

18వేల 782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హైకోర్ట్ తీర్పు నేపథ్యంలో ఫలితాలు ఎప్పుడు వెలువడేది క్లారిటీ లేదు. దీంతో అభ్యర్థులకు మరింత టెన్షన్ పెరిగింది. పోలింగ్ సందర్భంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ శ్రేణులు పలు ప్రాంతాల్లో ఘర్షణకు దిగారు.

ట్రెండింగ్ వార్తలు