Yogi Vemana University: యోగి వేమన విగ్రహం తొలగింపుపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం వివరణ

కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన భవనం ముందు నుంచి యోగి వేమన విగ్రహాన్ని తీసేశారంటూ వస్తున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం స్పందించింది. విశ్వవిద్యాలయంలోని ప్రధాన పరిపాలన భవనం ముందు ఉండే యోగి వేమన విగ్రహాన్ని అధికారులు తొలగించి గేటు పక్కన పెట్టారని, ఆ విగ్రహం స్థానంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని వస్తున్న వార్తలు నిజాన్ని పక్కదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొంది.

Yogi Vemana University: కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రధాన పరిపాలన భవనం ముందు నుంచి యోగి వేమన విగ్రహాన్ని తీసేశారంటూ వస్తున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం స్పందించింది. విశ్వవిద్యాలయంలోని ప్రధాన పరిపాలన భవనం ముందు ఉండే యోగి వేమన విగ్రహాన్ని అధికారులు తొలగించి గేటు పక్కన పెట్టారని, ఆ విగ్రహం స్థానంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని వస్తున్న వార్తలు నిజాన్ని పక్కదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొంది.

వేమనకు మరింత గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆయన విగ్రహాన్ని యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్దకు మార్చారని చెప్పింది. గతంలో వేమన విగ్రహం నడిరోడ్డుపై ఉండేదని, దీంతో ఇప్పుడు దాన్ని వర్సిటీ గేటు వద్దకు మార్చారని పేర్కొంది. అలాగే, ఇంతకు ముందే వైఎస్సార్ విగ్రహం వర్సిటీలోని ఓ చోట ఉండేదని, తాజాగా, వేమన, వైఎస్సార్ విగ్రహాలను వేరే చోటుకి మార్చాలని వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకుని ఆ పనిచేశారని చెప్పింది.

దీన్నే వక్రీకరిస్తూ వార్తలు వచ్చాయని చెప్పుకొచ్చింది. కాగా, యోగి వేమన వర్సిటీ ప్రధాన పరిపాలన భవనం నుంచి వేమన విగ్రహాన్ని తీసేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. వేమన పద్యాలను పోస్ట్ చేసి, పరోక్షంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన ట్వీట్ ను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం రీట్వీట్ చేసింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..