Whale Shark Fish : విశాఖ తీరానికి అనుకోని అతిథి.. ప్రపంచంలోనే అతి పెద్ద చేప వేల్‌ షార్క్‌

మత్స్యకారుల వలకి చిక్కిన ఈ చేప 50 అడుడుల పొడవు, సుమారు 2 టన్నుల బరువు ఉంది. ఇటీవల కాలంలో క్రమేనా అంతరించిపోతున్న షార్క్ జాతుల్లో ఇదొకటని వారు తెలిపారు.

The world’s largest fish whale shark : విశాఖ తంతిడి తీరానికి అనుకొని అతిథి వచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా గుర్తించబడిన వేల్‌ షార్క్‌ విశాఖ తీరంలో కనిపించింది. తంతడి బీచ్‌లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు చిక్కింది. దీంతో వారు దానిని సముద్రం ఒడ్డుకు తీసుకువచ్చారు. దీనిని గమనించిన వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ మన్నెపూరి శ్రీకాంత్ జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అధికారులు చేపను పరిశీలించి.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన వేల్ షార్క్‌గా గుర్తించారు.

మత్స్యకారుల వలకి చిక్కిన ఈ చేప 50 అడుడుల పొడవు, సుమారు 2 టన్నుల బరువు ఉంది. ఇటీవల కాలంలో క్రమేనా అంతరించిపోతున్న షార్క్ జాతుల్లో ఇదొకటని వారు తెలిపారు. మత్స్యకారులు వేల్ షార్క్ కు ఫీడింగ్ ఇచ్చి… అనంతరం సురక్షితంగా సముద్రంలోకి పంపారు. తమ ప్రయత్నాలు విజయవంతంగా పూర్తయ్యాయని .. వేల్ షార్క్ సముద్రంలో స్వేచ్ఛగా తిరుగుతోందని అటవీ అధికారులు తెలిపారు.

Letter To KRMB : కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మరో లేఖ

మత్స్యకారులు ఇలాంటి భారీ చేపలు తీరానికి కొట్టుకు వ‌చ్చినా.. వలకు చిక్కినా త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు. ఇలాంటి వాటిని సురక్షితంగా ర‌క్షించి తిరిగి సముద్రంలోకి పంపించాలని కోరారు. ఈ చేపను చూడడానికి స్థానికులు కూడా తరలివెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు