Theatres (1)
Movie Tickets Rates: ఏపీలో సినిమా టికెట్ల రచ్చ మొదలైంది. ఇప్పటివరకు కరోనాతో మూతబడ్డ థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతివ్వగా.. ఇప్పుడు టికెట్ రేట్లు వివాదానికి దారితీశాయి. రేపటి నుంచి థియేటర్లు ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో సినిమాలు ప్రదిర్శించుకోవచ్చునని ప్రకటించింది. అయితే, టికెట్ రేట్లపై విడుదల చేసిన జీవో ఇప్పుడు రచ్చకు కారణం అవుతోంది.
సిటీ పరిధిలోని థియేటర్లలో టికెట్లకు ఒక రేటు, నగర శివార్లు, బీ, సీ థియేటర్లలో టికెట్లకు మరో రేటును నిర్ణయించుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ రేట్ల ప్రకారమే టికెట్లను విక్రయించాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం థియేటర్లను నడపలేమని అంటున్నారు థియేటర్ల ఓనర్స్. టికెట్ ధరలు, లైసెన్సింగ్ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై విజయవాడలో ఏపీ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు సమావేశం అయ్యారు.
టికెట్ ధరలపై క్లారిటీ వచ్చాకే థియేటర్లు ఓపెన్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. 13 జిల్లాల నుంచి మీటింగ్‌లో పాల్గొన్న థియేటర్ల యజమానులు దీనిపైనే చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు రేపటి నుంచి కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సమయంలో థియేటర్లు ఓపెన్ కాకుంటే ఎలా ఇబ్బందులు ఎదుర్కోవాలి? అనే ఆలోచనలో ఉన్నారు.