Deputy CM Narayana Swamy
Narayana Swamy – Chandrababu : విశాఖ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పరిశ్రమల్లో స్థానికులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. కులాలకు, మాతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశ చరిత్రను మార్చిన నాయకుడు సీఎం జగన్ కొనియాడారు. గురువారం విశాఖ జిల్లా ఆనందపురం మండలం గోరింట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పోరేషన్ ఎక్సైజ్ కాంప్లెక్స్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి, రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాన చేశారు.
చంద్రబాబు అరెస్ట్ లో రాజకీయ ప్రమేయం లేదన్నారు. 2018లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం బయట పడిందన్నారు. అన్ని ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలిపారు. కులాభిమనంతో రేణుక చౌదరి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షరాలో, టీడీపీ అధ్యక్షరాలో అర్ధం కాలేదన్నారు. మార్గదర్శి అవినీతి బండారం బయట పడిందని తెలిపారు. గతంలో దేశంలో అతి పెద్ద అవినీతి పరుడు చంద్రబాబు అని పవన్ చెప్పారు అని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఆర్ధిక నేరస్తుడు చంద్రబాబుతో కలిసిపోయారని పేర్కొన్నారు.
Innovative Protest : చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఢిల్లీలో విశాఖ వాసుల వినూత్న నిరసన
పవన్ కళ్యాణ్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. భీమిలి నియోజక వర్గంలో ఎక్సైజ్ కాంప్లెక్స్ కు భూమి పూజ చేయడం సంతోషకరమని రీజనల్ కోర్డనేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆనందపురంలో ఎమ్ఎస్ఎమ్ఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భీమిలి అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. భీమిలిని రాజధాని ప్రాంతంగా సీఎం జగన్ ఎంపిక చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే అవంతిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
రీజనల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం సంతోషమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఐదు ఎకరాల స్థలంలో రూ.20 కోట్ల వ్యవయంతో నిర్మాణం జరుగతోందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఎమ్ఎస్ఎంఈ పార్కు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ త్వరలో రాబోతుందన్నారు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తాయని చెప్పారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం భీమిలీ అని అన్నారు.
Harsha Kumar : చంద్రబాబు అరెస్ట్ ను జగన్ వాడుకుంటున్నారు : హర్షకుమార్
రాజధానిగా భీమిలి ప్రాంతాన్ని సీఎం వైఎస్ జగన్ ఎంపిక చేశారని తెలిపారు. ఐదు ఎకరాల్లో రూ.20 కోట్లతో ఎక్సైజ్ కాంప్లెక్స్ నిర్మించడం సంతోషకరమని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వైఎస్ జగన్ అధ్వర్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తిన లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, జెడ్పీ చైర్ పర్సన్ సుభద్ర పాల్గొన్నారు.