Theft : అనంతలో దొంగల బీభత్సం.. టీచర్‌ని హత్యచేసి దోపిడీ
అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని కదిరి పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉష ఇంట్లోకి చొరబడిన దొంగలు దోచుకునే క్రమంలో ఆమె అడ్డుకోవడంతో దాడి చేసి చంపేశారు.
- kunduru Vinod
- Published On : November 16, 2021 / 09:27 AM IST
Theft
Theft : అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని కదిరి పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉష ఇంట్లోకి చొరబడిన దొంగలు దోచుకునే క్రమంలో ఆమె అడ్డుకోవడంతో దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత వారి పక్కింట్లో దోపిడీకి దోపిడీకి పాల్పడింది దొంగల ముఠా.. మహిళ అడ్డుకోవడంతో ఆమెపై కూడా అది చేశారు. ఉపాధ్యాయురాలు ఉష భర్త వాకింగ్‌కి వెళ్ళింది గమనించిన దొంగలు ముఠా ఇంట్లోకి చొరబడి దోపిడీకి యత్నించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఉషపై దాడి చేసిన దుండగులు హత్యచేసి అందినకాడికి దోచుకెళ్లారు.
చదవండి : Theft In Police Officers Apartement : పోలీసాఫీసర్లు ఉండే అపార్ట్‌మెంట్ లోనే చోరీ
ఆ తర్వాత మరో ఇంట్లోకి చొరబడిన దొంగల గ్యాంగ్ ఇంట్లోని మహిళపై దాడి చేసి అక్కడకూడా దోచుకు పోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించాగా ఉషను పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు.
చదవండి : Hyderabad Thefts: రాష్ట్ర రాజధానిని నమ్మకంతో ముంచేస్తున్న నేపాలీ గ్యాంగ్
