Hyderabad Thefts: రాష్ట్ర రాజధానిని నమ్మకంతో ముంచేస్తున్న నేపాలీ గ్యాంగ్

హైదరాబాద్ వ్యాప్తంగా దొంగతనాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఎక్కువగా నేపాల్ గ్యాంగ్‌ల కారణంగా రాష్ట్ర రాజధానిలో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది.

Hyderabad Thefts: రాష్ట్ర రాజధానిని నమ్మకంతో ముంచేస్తున్న నేపాలీ గ్యాంగ్

Nepali Ganag

Hyderabad Thefts: హైదరాబాద్ వ్యాప్తంగా దొంగతనాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఎక్కువగా నేపాల్ గ్యాంగ్‌ల కారణంగా రాష్ట్ర రాజధానిలో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఈ భయంతోనే ఒకరు కావాల్సిన చోట ఇద్దరు.. ముగ్గురు సెక్యూరిటీ గార్డులను రిక్రూట్ చేసుకుంటున్నారు.

గతేడాది రాచకొండ, హైదరాబాద్, సైదాబాద్ ట్రై కమిషనరేట్ల పరిధిలో కనీసం 10నేరాల విలువ కోట్లలో ఉన్నాయి. నేరం జరిగిన వెంటనే నేపాల్ కు పారిపోతుండటంతో పోలీసులకు దర్యాప్తులో ట్రాకింగ్ కష్టంగా మారింది.

ముందుగానే ప్లాన్ చేసి ముఠా సభ్యులలో ఒకరు టార్గెట్ చేసుకుని ఆ ఇంట్లో ఉద్యోగం పొంది యజమాని విశ్వాసం పొందుతారు. కుక్, సెక్యూరిటీ గార్డ్, డ్రైవర్, బాడీ గార్డ్ లాంటి జాబ్‌లకు ప్రయత్నిస్తారు. ఉద్యోగం పొందాక సరైన సమయం చూసుకుని గ్యాంగ్ లో ఇతరులకు సమాచారం అందించడంతో ఇల్లు దోచుకోవడం ఈజీ అయిపోతుంది. నేపాల్ లేదా ఈశాన్య రాష్ట్రాల్లోకి చొరబడి దాక్కోవడంతో పట్టుకోవడం కష్టంగా మారిపోతుందని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర అంటున్నారు.

కొన్ని సందర్భాల్లో నేరానికి పాల్పడే ముందు ఆహారంలో మత్తు మందు కలపడం లాంటివి కూడా చేస్తున్నారని అన్నారు. గతేడాది నార్సింగి, రాయదుర్గం, నాచారం, అబిద్ రోడ్, కుషాయిగూడ, మలక్‌పేట్‌లో నేపాలీ గ్యాంగ్ దోపిడీలు ఎక్కువగా కనిపించాయి. ఈ ముఠాల ప్రధాన వ్యక్తులు ఢిల్లీలో ఉండి కార్యకలాపాలు నడిపిస్తుంటారు. దేశవ్యాప్తంగా ఇళ్లలో పనిచేసే నేపాలీలను గుర్తించి వారి ద్వారా దోపీడీలు చేస్తుంటారు.

‘ముఠా సభ్యులందరూ సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయి ఉండి, యజమానులు బయటకు వెళ్లినప్పుడు ఒకరినొకరు అప్రమత్తం చేసుకుంటారు’ అని నాంపల్లి ఇన్స్‌పెక్టర్ ఖలీల్ పాషా చెప్పారు.

‘ముఠాల కదలికను అధ్యయనం చేసిన తరువాత, బృందాలు సరిహద్దు తనిఖీ కేంద్రాలను దాటి పారిపోతుండగా పట్టుకోగలిగినా.. పారామిలిటరీ దళాలకు ముఠాల సమాచారాన్ని పంపి అడ్డుకోగలుగుతున్నాం. కాకపోతే, దౌత్యపరమైన సమస్యల కారణంగా నేపాల్ నుండి వాటిని పొందడం కొంచెం కష్టమవుతుంది’ అని సీనియర్ అధికారి చెప్పారు.

 

……………………………………… : తెలంగాణలో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు

విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకునే ముందు వారి వివరాలను హ్యాక్ఐ అప్లికేషన్ లో అప్ లోడ్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాయదుర్గం దొంగతనం కేసులో..
రాయదుర్గం దొంగతనం కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. నేరానికి పాల్పడిన నేపాలీ జంటను శనివారం అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని షోలాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.68.2 లక్షల విలువైన 1.1 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రాలు, రూ .7.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ చేసిన వ్యక్తులు నేపాల్ లోని కలికోట్ జిల్లాకు చెందిన ఎల్ బహదూర్ సాహి అలియాస్ లక్ష్మణ్ (వాచ్‌మెన్), కె. పవిత అలియాస్ పనా (పని మనిషి).

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ జంట దాదాపు ఐదు నెలల క్రితం నేపాల్‌కు చెందిన యమ్‌లాల్ ద్వారా వాచ్‌మ్యాన్, డొమెస్టిక్ హెల్పర్‌గా గచ్చిబౌలిలోని టెలికామ్ నగర్‌లోని గోవిందరావు ఇంట్లో పనిలో చేరారు. “సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉండి, యజమానికి విధేయులుగా నటించారు. అతని దగ్గర బాగా నమ్మకం పొందారు’ అని రవీంద్ర చెప్పారు.

సెప్టెంబర్ 18 న, శ్రీశైలంలో ఒక వేడుకలో పాల్గొనేందుకు గానూ.. రావు ఇంటి నుంచి బయటకువెళ్తూ.. ఇంటిని చూసుకోవాలని దంపతులకు అప్పగించారు.

“అదే అర్ధరాత్రి, సీసీ కెమెరా కేబుల్స్ తొలగించి ఇనుప రాడ్‌తో కిటికీ గ్రిల్‌ను తీసి ఇంట్లోకి ప్రవేశించారు. మాస్టర్ బెడ్‌రూమ్ తలుపును పగలగొట్టి, కీని ఉపయోగించి అల్మారాను తెరిచారు. చీరల క్రింద ఉన్న లాకర్ కీ సహాయంతో రూ .61 లక్షల విలువైన నగదు, బంగారం మరియు వజ్రాల ఆభరణాలను దొంగిలించారు’ అని ఆయన అన్నారు.