Kakinada Thieves Twist : వెరైటీ దొంగల ట్విస్ట్.. డబ్బు, బంగారం కొట్టేసి తిరిగిచ్చారు! కట్ చేస్తే.. రూ. 22వేలు వాడేశామంటూ లెటర్..!
Kakinada Thieves Letter : పక్కా ప్లాన్ చేసి ఇంట్లో చొరబడి రూ. 50వేలు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లారు. అందులో రూ.22 వేలు వాడేశాం.. ఇవ్వలేమని ఆ ఇంటి ముందు ఒక లెటర్ వదిలేసి వెళ్లిపోయారు..
- Sreehari A
- Updated on- August 3, 2026 / 04:36 PM IST
Thieves Return Stolen Gold And Cash Apologize For Spending Rs 22000 ( Image Credit : AI )
- చోరీ చేసిన బంగారం, డబ్బు తిరిగి ఇచ్చిన దొంగలు..
- ఆ రూ.22 వేలు మాత్రం తిరిగి ఇవ్వలేమంటూ షాకింగ్ నోట్
- దొంగలు రాసిన లెటర్ వైరల్.. ఘటనపై పోలీసుల దర్యాప్తు
- కాకినాడ కరప పోలీస్ స్టేషన్ పరిధిలో వింత చోరీ ఘటన వెలుగులోకి
Kakinada Thieves Twist : భలే దొంగలు.. ప్లాన్ ప్రకారమే ఓ ఇంట్లో చోరీ చేశారు.. డబ్బు, బంగారం ఎత్తుకెళ్లారు.. కట్ చేస్తే వారం తర్వాత ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.. ఈ వెరైటీ దొంగలు మాత్రం కొన్ని డబ్బులు వాడేసుకుని మిగతా డబ్బు, బంగారం తిరిగి ఇచ్చేశారు.. ఈ వింత చోరీ ఘటన కాకినాడ రూరల్ జిల్లా కరప పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
ఇంట్లో చోరీ చేసిన రెండు వారాల తర్వాత బంగారు ఆభరణాలను తిరిగి బాధితుడి ఇంటి ఆవరణలో పడేశారు. అయితే, నగదులో కొంత వాడుకున్నామని లేఖ రాసి వెళ్లడం సంచలనంగా మారింది.
Read Also : శ్రీశైలం భక్తులకు బిగ్ అలర్ట్.. ప్రొటోకాల్ దర్శనాల్లో మార్పులు.. ఆలయ ఈవో కీలక ప్రకటన
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. :
కరప గ్రామంలోని రామకంచిరాజు నగర్‌కు చెందిన గణేష్ జూలై 18న కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లారు.అదే రాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు రూ.6.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదును చోరీ చేశారు.
ఇంటికి తిరిగి వచ్చిన గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కరప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన 2 వారాల తర్వాత తెల్లవారుజామున గణేష్ ఇంటి ఆవరణలో ఓ మూట కనిపించింది. అందులో చోరీ అయిన బంగారు ఆభరణాలు, రూ.28 వేల నగదు ఉన్నాయి.
అలాగే అందులో ఒక లేఖ కూడా కనిపించింది. ఆ లేఖలో ‘మేము చేసింది తప్పే. మా సొంత అవసరాల కోసం రూ.22 వేలు వాడుకున్నాం. ఆ డబ్బు తిరిగి ఇవ్వలేం’ అని దొంగలు రాసినట్లు సమాచారం. దొంగలు చోరీ చేసిన సొత్తును తిరిగి ఇవ్వడమే కాకుండా నగదులో కొంత వాడుకున్నట్లు లేఖలో పేర్కొనడం స్థానికంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజంగా దొంగల పనేనా? ఎవరైనా కావాలనే చేసి ఉంటారా? ఇలా అన్ని కోణాల్లో కరప పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
