Thirumala
Srivari Darshanam tokens : తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శన టోకెన్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. డిసెంబర్ కోటాకు సంబంధించిన టికెట్లను శనివారం (నవంబర్ 27,2021) ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లను ఆదివారం విడుదల చేస్తోంది.
కరోనా నేపథ్యంలో టీటీడీ ఆన్‌లైన్‌లోనే అన్ని రకాలుగా దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. గత రెండు నెలలుగా సర్వదర్శనం టోకెన్లను కూడా ఆన్‌లైన్ ద్వారానే విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని గుర్తించి భక్తులు శ్రీవారి దర్శనం కోసం ముందుగానే టోకెన్లు, వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.