Srivari Virtual Acquired Services : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది. వర్చువల్ ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న భక్తుల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ నెల 17, 18, 19, 20వ తేదీలతోపాటు 30, 31వ తేదీలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను ‘https://tirupatibalaji.ap.gov.in’ అనే వెబ్‌సైట్ ద్వారా విడుదల చేయనుంది.