Jaggampeta YCP : జగ్గంపేట వైసీపీలో ముసలం.. తోట నరసింహం వర్సెస్ ఎమ్మెల్యే చంటిబాబు

పార్టీ నాయకులను బ్రోకర్లంటూ విమర్శించిన తోట నరసింహం, ఆయన తనయుడిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చంటిబాబు వర్గం చెబుతోంది. ఇప్పుడు అభివృద్ధి జరగలేదని తాను ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని చెబుతున్న తోట వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతున్నారు.

Narasimham - Chantibabu

Thota Narasimham – Chantibabu : కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీలో ముసలం మొదలైంది. మాజీ మంత్రి తోట నరసింహం వర్సెస్ ఎమ్మెల్యే చంటిబాబు వర్గంగా మారింది. వచ్చే ఎన్నికల్లో సీటు తనదేనంటూ తోట ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అధిష్టానం తన వైపే మొగ్గు చూపుతుందని ప్రచారం చేస్తున్నారు.

జగ్గంపేటలో ఇకపై ఇంకో లెక్క అంటూ నరసింహం కొడుకు రాంజీ సవాళ్లు విసురుతున్నారు. కొందరు వైసీపీ నేతలు బ్రోకర్లు అంటూ ఓ సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. దీంతో తోట కుటుంబం తీరుపై ఎమ్మెల్యే చంటిబాబు వర్గం గుర్రుగా ఉంది. తోట నరసింహం తీరుపై జడ్పీటీసీలు, ఎంపీపీలు మండిపడుతున్నారు. పార్టీలోనే ఉంటూ ఆత్మీయ సమావేశాలు అంటూ పార్టీ క్యాడర్ విచ్ఛిన్నం చేస్తున్నారని చంటిబాబు వర్గం అంటోంది.

Purandheswari : కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం : పురంధేశ్వరి

పార్టీ నాయకులను బ్రోకర్లంటూ విమర్శించిన తోట నరసింహం, ఆయన తనయుడిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చంటిబాబు వర్గం చెబుతోంది. ఇప్పుడు అభివృద్ధి జరగలేదని తాను ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని చెబుతున్న తోట వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతున్నారు.

మీరు జగ్గంపేటలో ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన కాలంలో ఎంపీపీ జడ్పీటీసీలను గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. చంటిబాబు హయాంలో నాలుగు మండలాల్లో వైసీపీ జెండా ఎగరవేసిందని తోటను ఉద్దేశించి జగ్గంపేట, కిర్లంపూడి ఎంపీపీలు, జడ్పీటీసీ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు విమర్శించారు. ఇప్పటికే ప్రతిపాడు, పెద్దాపురం నియోజవర్గాల్లో పేచీలతో వైసీపీ అధిష్టానం తల పట్టుకుంటుంది.

ట్రెండింగ్ వార్తలు