Threat Call : గన్నవరం విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్

అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు రాత్రి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపి వేశారు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టులో బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు.

Threat Call To Gannavaram Airport

Threat Call To Gannavaram Airport : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్ వచ్చింది. ఓ అగంతకుడు ఈ బెదిరింపు కాల్ చేశారు. ఎయిర్ ఇండియా 320 విమానంలో బాంబు ఉందని కాల్ వచ్చింది.

అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు రాత్రి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపి వేశారు. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టులో బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఎయిర్ పోర్టులోనికి పోలీసులు ఎవరినీ అనుమతించలేదు.

Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. అసలు విషయం తెలిసి ఊపిరిపీల్చుకున్న అధికారులు

ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, బాంబు బెదిరింపు కాల్ తో ఎయిర్ ఇండియా 320 విమానం ఆగిపోయింది. మూడు గంటలపాటు ఎయిర్ ఇండియా 320 విమానం ఆలస్యంగా ప్రయాణం చేసింది. విమానంలో ఏం జరుగుతుంది? ఎయిర్ పోర్టులో ఏమైంది అన్న కలకలం రేగింది.

విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ విమానం దాదాపు మూడున్నర గంటలపాటు ఆగిపోయింది. దాదాపు నాలుగు గంటల తర్వాత ఇది ఫేక్ కాల్ ల్ గా ఎయిర్ ఇండియా అధికారులు, ఎయిర్ పోర్టు సిబ్బంది నిర్ధారించారు. దీంతో ప్రయాణికులతోపాటు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Vistara flight : ఢిల్లీ విమానాశ్రయంలో విస్తారా విమానానికి బాంబు బెదిరింపు

రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం మూడున్నర గంటలు ఆలస్యంగా బయలుదేరింది. బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? దీనికి కారణాలేంటి అనే దిశగా ఎయిర్ పోర్టు యంత్రాంగం, భద్రతా సిబ్బంది విచారణ చేస్తోంది.