Building Collapsed : కదిరిలో కూలిన మూడంతస్తుల భవనం – ముగ్గురు మృతుల్లో ఇద్దరు చిన్నారులు

అనంతపురం జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కదిరి చైర్మన్‌వీధిలో వరద ఉధృతికి మూడు భవనాలు కూలిపోయాయి.

Building Collapsed :  అనంతపురం జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. కదిరి చైర్మన్‌వీధిలో వరద ఉధృతికి మూడు భవనాలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు భార్య, భర్తలను సురక్షితంగా కాపాడారు రెస్క్యూ టీమ్. శిథిలాల కింద మరో 9 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు అధికారులు.

ముందుగా మూడు అంతస్థుల భవనం కూలింది. ఈ భవనం పక్కనే ఉన్న రెండతస్తుల భవనంపై పడడంతో అది కూడా నేలమట్టమైంది. దీంతో మరో భవనం కూడా ధ్వంసమైంది. మూడు భవనాల్లో సుమారు 11 మంది ఉన్నట్లు సమాచారం. అందులో ఇద్దరు వ్యక్తులను శిథిలాల నుంచి రక్షించింది సహాయక బృందం. మిగిలిన వారి కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Also Read : Chitravathi River Rescue Operation : చిత్రావతి నదిలో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకువచ్చిన నేవీ

ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఫాతిమా అనే మహిళ మృతి చెందినట్లు తెలుస్తోంది. చిన్నారుల్లో ఏడాది పాపతో పాటు.. మూడు సంవత్సరాల బాలిక కూడా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద వీరిని గుర్తించిన రెస్క్యూ టీమ్.. ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో 8 మంది ఇంకా శిథిలాల కిందే ఉన్నారు. వారిని కాపాడటానికి సహాయ చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.

ట్రెండింగ్ వార్తలు