AP Three Capitals : మూడు రాజధానులు ఖాయం

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిందే తమ విధానం అన్నారాయన.

Ap Three Capitals

AP Three Capitals : ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ చెప్పిందే తమ విధానం అన్నారాయన. అప్పటి నుంచే మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, మూడు రాజధానుల ఏర్పాటుకు డీపీఆర్ ఎప్పుడో సిద్ధమైందని చెప్పారు.

అయితే కొన్ని దుష్టశక్తులు కోర్టు ద్వారా అడ్డుకోవడంతో ఆలస్యం అవుతోందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న సీఎం జగన్ సంకల్పం ధృడమైందని, అది కచ్చితంగా నెరవేరుతుందని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు.