Three Suspicious Death : విజయనగరం జిల్లాలో తల్లీదండ్రులు, కుమార్తె అనుమానాస్పద మృతి

కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ పొలాల సమీపంలో నూతిలో పడి ముగ్గురు కుటుంబసభ్యులు అనుమానాస్పదంగా మృతి చెందారు.

Three suspicious death

Vizianagaram Three Suspicious Death : విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. తల్లీదండ్రులు, కుమార్తె అనుమానాస్పదంగా మృతి చెందారు. కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామ పొలాల సమీపంలో నూతిలో పడి ముగ్గురు కుటుంబసభ్యులు అనుమానాస్పదంగా మృతి చెందారు. తండ్రి, తల్లి, కుమార్తె మృతి చెందారు.

విశాఖపట్నం జిల్లా మర్రిపాలెం గ్రామ ఎఫ్ సీఐ నగర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. మృతులు ఎం.డీ మహినుద్దీన్(46), సంసు(39), కుమార్తె బహిర(17)గా గుర్తించారు. వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Suspicious Death : నందివాడ ఎస్సై శిరీష భర్త అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం

వీరిది హత్యా? ఆత్మహత్య? లేదా ప్రమాదవశాత్తు నూతిలో పడి చనిపోయారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.