Chandrababu Naidu: నేడు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన.. భారీగా భద్రత

శ్రీశైలం అడవుల్లో గ్రేహౌండ్స్​ బలగాలు జల్లెడ పడుతున్నాయి.

CM Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీశైలంలో పర్యటించనున్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌ను ప్రయోగాత్మకంగా నడపనున్నారు. చంద్రబాబు చేతుల మీదుగా నేడు ప్రారంభం కానున్నాయి ఈ సర్వీసులు.

డీ హవిల్లాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్ సర్వీసులను చంద్రబాబు శ్రీశైలంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా శ్రీశైలంలో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్​ చుట్టూ భారీగా పోలీస్​ భద్రత ఏర్పాటు చేశారు.

శ్రీశైలం అడవుల్లో గ్రేహౌండ్స్​ బలగాలు జల్లెడ పడుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్​ లో ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు, పోలీసు బలగాలు హై స్పీడ్​ ఇంజన్​ బోట్లతో రెస్క్యూ టీమ్​ అప్రమతమైంది. సీఎం శ్రీశైలం పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు తనిఖీలు చేస్తున్నాయి.

ఉదయం 10.40 గంటలకు ఉండవల్లి లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటారు చంద్రబాబు. 10.45 గంటలకు సీప్లేన్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి సీప్లేన్ లో బయలుదేరి 12.40 గంటలకు శ్రీశైలం పాతాళగంగ వద్ద బోటింగ్ పాయింట్ కు చేరుకుంటారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఇవాళ మధ్యాహ్నం 2 నుంచి 2.20 గంటల వరకు మీడియా సమావేశంలో పాల్గొంటారు.

Drunk Driving Cases: హైదరాబాద్‌లో తీరు మార్చుకోని మందుబాబులు.. పలు చోట్ల డ్రంకెన్‌ డ్రైవ్ కేసులు