పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవదహనం

పల్నాడు జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట - పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.

Palnadu Road Accident

Bus Accident In Palnadu District : పల్నాడు జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో క్షణాల్లో బస్సులో అగ్నికీలలు కమ్మేశాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు ప్రయాణికుల జాడ ఇంకా తేలియలేదని సమాచారం. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Also Read : భారీగా బంగారం కొనేస్తున్న చైనా..! ఎందుకిలా? అసలు డ్రాగన్ కన్నింగ్ స్కెచ్ ఏంటి? టార్గెట్ ఎవరు?

ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీరు తమ స్వగ్రామాలకు వచ్చారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బాపట్ల జిల్లా నుంచి హైదరాబాద్ కు వెళ్తుంది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో జనగంజాం, గోనసపూడి, నీలాయపాలెం గ్రామాల వారు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం పరిధిలోని అన్నంబట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య కంకర టిప్పర్ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. క్షణాల్లో టిప్పర్ కు మంటలు చలరేగి.. ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి. ప్రమాద సమాచారంతో పోలీసులు, స్థానికులు ఘటన స్థలం వద్దకు చేరుకొని 108 సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read : Attack On Pulivarthi Nani : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి.. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

బైపాస్ వర్క్ జరుగుతుండటం, తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం, టిప్పర్ వేగంగా దూసుకురావడం ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ప్రమాదం జరగడం, బస్సుకు మంటలు వ్యాపించడంతో అందరూ ఒక్కసారిగా బస్సు నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పలువురు స్వల్ప గాయాల నుంచి బయటపడగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నికీలలకు బస్సు, టిప్పర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సహాయంగా నిలుస్తామన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

 

ట్రెండింగ్ వార్తలు