Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. కేవలం వారికి మాత్రమే.. ఒకే టికెట్‌పై ఇద్దరికి అవకాశం.. ఇలా బుక్ చేసుకోండి..

Tiruchanoor Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.

Tiruchanoor Varalakshmi Vratham

  • తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
  • తిరుచానూరులో 21న వరలక్ష్మీ వ్రతం
  • నేడు ఆన్‌లైన్‌లో.. ఈనెల 20న ఆఫ్‌లైన్‌లో టికెట్లు

Tiruchanoor Varalakshmi Vratham : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) శుభవార్త చెప్పింది. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్మించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, వరలక్ష్మీ వత్రానికి సంబంధించి ఐదు వందల వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టికెట్లు భక్తులకు జారీ చేయనున్నారు. బుధవారం ఉదయం 10గంటలకు ఆన్‌లైన్ కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

Also Read : Uppada Sea Erosion Wall: ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్.. రూ. 323 కోట్లతో తీర రక్షణ గోడ.. పవన్ సమక్షంలో కీలక ఒప్పందం

వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్ చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 21వ తేదీన శుక్రవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం ఆగయోక్తంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అయితే, వ్రతం సందర్భంగా అభిషేకం, అభిషేకానంతరం దర్శనేం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్ సేవలను రద్దు చేశారు.

టికెట్లు ఇలా..
వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనాలనుకొనే భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో బుధవారం ఉదయం 10గంటలకు ఆన్‌లైన్ కోటాలో టికెట్లు బుక్ చేసుకోవాలి. లేదంటే.. ఆఫ్‌లైన్‌లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈనెల 20వ తేదీన ఆఫ్‌లైన్‌లో ముందు వచ్చినవారికి ముందు ప్రతిపాదికన టికెట్లు ఇవ్వనున్నారు. ఒక టికెట్‌పై దంపతుల్ని వరలక్ష్మి వ్రతానికి అనుమతిస్తారు. ఆ రోజున ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.

వరలక్ష్మీ వ్రతంకు విశేష ప్రాశస్త్యం..
శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాశస్త్యం ఉంది. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించే మహిళలకు సత్సంతానం, దీర్ఘ సుమంగళీ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయని అర్చకులు తెలిపారు.