TTD : తిరుమల భక్తులకు అలర్ట్.. నవంబరు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తేదీ ఇదే..

TTD : నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది.

Tirumala Tirupati Devasthanams

TTD : నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. నవంబర్ నెలలో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేనున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read : Narasaraopet Theft Case : ‘నన్ను క్షమించండి’.. రూ.19లక్షలు రిటర్న్ ఇచ్చిన దొంగ.. నరసరావుపేటలో షాకింగ్ ట్విస్ట్.. అంజనం ఎఫెక్టేనా? 

అయితే, ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం ఈనెల 20న ఉదయం 10గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నంలోపు సొమ్ము చెల్లించి లక్కీడిప్‌ టికెట్లు పొందాల్సి ఉంటుంది.

అదేవిధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను ఈనెల 21వ తేదీన ఉదయం 10గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదేరోజు మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ పేర్కొంది.

24న ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణం, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శన కోటా, మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు.

25న ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశదర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్‌ కోటాను విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in/ వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్‌ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది.

నకిలీ సైట్లపై టీటీడీ హెచ్చరిక..
తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్‌ల పేరుతో సాగుతున్న సైబర్ మోసాల పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తులను తీవ్రంగా అప్రమత్తం చేసింది. టీటీడీ అధికారిక ముద్ర, లోగో, చిత్రాలు, ట్రేడ్‌మార్క్‌లను అక్రమంగా ఉపయోగిస్తూ కొందరు మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీలను సృష్టించి భక్తుల నుండి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలోనే అనధికారిక లింకులను క్లిక్ చేయవద్దని, వాట్సాప్ సందేశాలను నమ్మి నగదు పంపవద్దని హెచ్చరించింది.