Tirumala Devotees : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. మచిలీపట్నం నుంచి తిరుచానూరుకు స్పెషల్ ట్రైన్.. టైమింగ్స్ ఇవే!

Tirumala Devotees : తిరుమల శ్రీవారి భక్తుల కోసం మచిలీపట్నం–తిరుచానూరు మధ్య ప్రత్యేక రైలు అందుబాటులోకి వచ్చింది. రైలు నంబర్లు, వారంలో ఏయే రోజుల్లో నడుస్తుంది, స్టేషన్లు, పూర్తి టైమింగ్స్ వివరాలివే..

Tirumala Devotees

  • శ్రీవారి భక్తుల కోసం వీకెండ్స్‌లో ప్రత్యేక రైలు
  • మచిలీపట్నం నుంచి తిరుచానూరుకు రైలు..
  • ఈ స్టేషన్ల మీదుగా తిరుచానూరుకు సర్వీస్

Tirumala Devotees : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తుల రద్దీని దృష్ట్యా మచిలీపట్నం–తిరుచానూరు మధ్య స్పెషల్ రైలు నడవనుంది. ప్రత్యేకించి వారాంతాల్లో ఈ రైలు సర్వీసులను అందించనుంది. ఈ మార్గంలో ప్రయాణించే భక్తులకు అదనపు రైలు సదుపాయం లభించనుంది.

07440 నంబర్‌ మచిలీపట్నం–తిరుచానూరు ప్రత్యేక రైలు శుక్రవారం, శనివారాల్లో నడుస్తుంది. మచిలీపట్నంలో సాయంత్రం 4.55 గంటలకు బయల్దేరే రైలు గుడివాడకు 5.23 గంటలకు, విజయవాడకు 6.20 గంటలకు చేరుకుంటుంది.

తెనాలికి రాత్రి 7 గంటలకు, చీరాలకు 7.48 గంటలకు, ఒంగోలుకు 8.48 గంటలకు చేరుతుంది. అనంతరం నెల్లూరుకు 10.28 గంటలకు, రేణిగుంటకు అర్ధరాత్రి 1 గంటలకు చేరుకుని తిరుచానూరుకు 2 గంటలకు చేరుకోనుంది.

Read Also : Vijay Sai Reddy : ఏపీకి మూడో పార్టీ అవసరం.. సీఎం అభ్యర్థిని నేను కాదు, నా కుటుంబంలోనూ ఎవరూ ఉండరు : విజయసాయిరెడ్డి

రైలు తిరుగు ప్రయాణంలో 07439 నంబర్‌ తిరుచానూరు–మచిలీపట్నం స్పెషల్ రైలు శనివారం, ఆదివారం నడుస్తుంది. తిరుచానూరులో తెల్లవారుజామున 3.30 గంటలకు బయల్దేరి విజయవాడకు ఉదయం 11 గంటలకు, మచిలీపట్నానికి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకోనుంది.

గుంటూరు–చర్లపల్లి మధ్య మరో స్పెషల్ ట్రైన్ :
మరోవైపు గుంటూరు–చర్లపల్లి మధ్య కూడా 07227/07228 నంబర్లతో ప్రత్యేక రైలు నడవనుంది. గుంటూరు–చర్లపల్లి రైలు ప్రతి ఆదివారం రాత్రి 9.45 గంటలకు బయల్దేరి ఉదయం 4 గంటలకు చర్లపల్లికి చేరుతుంది.

తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి 11.50 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి ఉదయం 6.10 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. ఈ రైలు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నల్లగొండ, నడికుడి, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతుంది. తిరుమల భక్తులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కూడా అదనపు రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.