Tirumala Heavy Rain, Roads All Blocked By Rainy Water
Tirumala Heavy Rain : తిరుమలలో భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అలాగే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. రెండు గంటలకుపైగా వర్షం కురిసింది. తిరుమాడ వీధులు, రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలులకు చెట్లకొమ్మలు అక్కడక్కడ విరిగిపడ్డాయి. స్వామివారి ప్రధాన ఆలయం చుట్టూ వరద నీరు నిలిచింది.
గంటల పాటు ఎడతెరపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దాంతో తిరుమలలో శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులు వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారు.
మాఢ వీధులు,లడ్డూ వితరణ కేంద్రాల్లో వర్షపు నీరు భారీగా చేరుకుంది. నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపిస్తున్నారు. తిరుమల ఘట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వచ్చే మూడురోజులు ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ పేర్కొంది.