Tirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మాడ వీధుల్లో రథంపై శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్ప స్వామి దర్శనం

ఉదయం స్వామివారు సూర్యమండల మధ్యస్తుడై హిరణ్మయ స్వరూపడిగా రామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ‌ వాహనసేవ జరుగనుంది.

Tirumala Srivari Brahmotsavam (1)

Tirumala Srivaru : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం 6.55 గంట‌ల‌కు ర‌థోత్సవం ప్రారంభం అయింది. మాడ వీధుల్లో రథంపై శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్ప స్వామి వారు దర్శనం ఇస్తున్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ‌ వాహనసేవ జరుగనుంది.

ఉదయం స్వామివారు సూర్యమండల మధ్యస్తుడై హిరణ్మయ స్వరూపడిగా రామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులను కటాక్షించారు. శంఖు చక్రాలు, కత్తి, విల్లు, బాణం, వరద హస్తంతో భక్తులకు సూర్యప్రభ వాహనంపై నుంచి అనుగ్రహించారు. మరోవైపు సోమవారం బ్రహ్మోత్సవాలు చివరికి దశకు చేరుకోనున్నాయి.

Tirumala Alert : తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఇకపై దివ్య దర్శనం టిక్కెట్లు అక్కడ మాత్రమే ఇస్తారు

ఉదయం రథోత్సవం, రాత్రి, 7 గంటలకు అశ్వవాహన సేవతో స్వామివారి వాహన సేవలు ముగియనున్నాయి. కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దంతపలు, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.