Tirumala Srivari Brahmotsavam : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. మీన లగ్నంలో ధ్వజారోహణం

తిరుమలలో శ్రీవారి ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అక్కడి అర్చకులు నిర్వహిస్తున్నారు.

Tirumala Srivari Brahmotsavam : తిరుమలలో శ్రీవారి ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అక్కడి అర్చకులు నిర్వహిస్తున్నారు. ధ్వజారోహణం అనంతరం రాత్రి 8 గంటలకు పెద్ద శేషవాహన సేవ ప్రారంభం కానుంది. కోవిడ్ దృష్ట్యా ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలను భక్తులు లేకుండా ఏకాంతంగా నిర్వహిస్తోంది టీటీడీ. ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం ప్రారంభించారు.



ఆలయంలోని కల్యాణ మండపంలోనే వాహన సేవలు నిర్వహించనున్నారు. శ్రీదేవి, భూదేవీ సమేతంగా ఆదిశేషవాహనంపై మలయప్పగా శ్రీవారు దర్శనమిస్తూ విహరించనున్నారు. దాస్య భక్తికి నిదర్శనం ఆదిశేష వాహనంగా చెబుతుంటారు.. త్రేతాయుగంలో లక్ష్మణుడే ఆదిశేషుడుగానూ ద్వాపరయుగంలో బలరాముడే ఆదిశేషుడుగా అవతరించాడు.



శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారమే అంకురార్పణ జరిగింది. కరోనా ప్రభావంతో ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా టీటీడీ నిర్వహిస్తోంది. విశ్వక్సేనుల ఉత్సవాన్ని ఆలయానికే పరిమితం చేసింది. 27న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కరోనా కారణంగా తిరుమల చరిత్రలో మొదటిసారి బ్రహ్మోత్సవాలు భక్తులు లేకుండా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.



ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరగనుంది. ఆ తరువాత రాత్రి 8 గంటల30 నిమిషాల నుండి 9గంటల 30 నిమిషాల వరకు పెద్దశేషవాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో 5వ రోజున ప్రధాన ఘట్టమైన గరుడ సేవ జరగనుంది. గరుడ సేవలో స్వామివారు సహస్రనామమాల, లక్ష్మీహారం, మకరకంఠి లాంటి విశేష ఆభరణాలను ధరించి గరుడ వాహనంపై ఆశీనులు కానున్నారు.

ట్రెండింగ్ వార్తలు