TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు.. షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే.. దరఖాస్తు ఇలా చేసుకోండి..

TTD Jobs Exam Schedule : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన విడుదలైంది. ఇంజనీరింగ్ విభాగంలో పలు పోస్టుల భర్తీకి సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు.

Tirumala Tirupati Devasthanam TTD Jobs Exam Schedule

  • తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన
  • టీటీడీలో ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీ
  • షెడ్యూలు విడుదల.. CBT విధానంలో రాత పరీక్ష

TTD Jobs: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన విడుదలైంది. ఇంజనీరింగ్ విభాగంలో పలు పోస్టుల భర్తీకి సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు. తిరుమలలో అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆలయ నిర్మాణాలు, నిర్వహణ పనుల్లో ఇంజనీరింగ్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో ఈ విభాగంలోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ వివరాలను వెల్లడించింది.

Also Read :  తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. నేటి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్లలోనే

మే 10, 11 తేదీల్లో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టు (CBT) విధానంలో రాత పరీక్షలను నిర్వహించనుంది. ఈ పరీక్షల ద్వారా ఏఈఈ (సివిల్), ఏఈఈ (ఎలక్ట్రికల్), ఏఈ (సివిల్, ఏటీవో (సివిల్ ) పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే, అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను రెండు రోజుల్లో వివిధ షిప్టుల వారీగా విభజించారు.

మే 10వ తేదీన (ఆదివారం) ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏఈఈ (సివిల్) పరీక్ష. మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు ఏఈఈ (ఎలక్ట్రికల్) పరీక్ష ఉంటుంది.
మే11వ తేదీన (సోమవారం) ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ఏఈ (సివిల్) పరీక్ష ఉంటుంది.

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమకు అనువైన పరీక్షా కేంద్రాలను ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఏప్రిల్ 29వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మాత్రమే అవకాశం కల్పించారు. నిర్ణీత గడువు ముగిసిన తరువాత సెంటర్లను మార్చుకోవడానికి లేదంటే ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉండదని టీటీడీ తెలిపింది.

పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు మే 2వ తేదీ నుంచి తమ హాల్ టికెట్లను వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే పరీక్షకు సంబంధించిన షిఫ్ట్ వివరాలను పరిశీలించి, అవసరమైన అభ్యర్థి నిర్ధారణ (కాండిడేట్ కన్ఫర్మేషన్) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాల వంటి వివరాలను అభ్యర్థులు కాల్ సెంటర్ నెంబర్ 155257ను సంప్రదించాలి. అంతేకాదు.. టీటీడీ అధికారిక వెబ్ సైట్ అయిన ttd-recruitment.aptonline.in ను సంప్రదించాలని టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు అధికారులు