Special Train 2026 : తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. నేటి నుంచి ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్లలోనే
Special Train 2026 : వేసవిలో పుణ్యక్షేత్రాలు మరీ ముఖ్యంగా తిరుమల వెళ్లే భక్తులకు రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు.
scr vijayawada division railway officers decide to special train in various routes from april 24
Special Train 2026 : మిగతా సీజన్లతో పోలిస్తే వేసవిలో ప్రయాణాలు చాలా వరకు పెరుగుతాయి. సెలవుల నేపథ్యంలో చాలా మంది పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు మరియు సొంతూళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతుంటారు. దీనివల్ల రైళ్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఈ వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. ఈ క్రమంలో విజయవాడ డివిజన్ అధికారులు ప్రయాణికులకు తీపి కబురు అందించారు. ఇప్పటికే నడుస్తున్న స్పెషల్ రైళ్లతో పాటు మరికొన్ని కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు.
ప్రధాన మార్గాలు ఇవే:
ఈ ప్రత్యేక సర్వీసులు కింది ప్రధాన మార్గాల్లో నడవనున్నాయి:
-
సికింద్రాబాద్ – అనంతపురం
-
కాకినాడ టౌన్ – లింగంపల్లి
-
బెంగళూరు – కాకినాడ టౌన్
-
వర్ధన్నపేట – యశ్వంత్పూర్
-
తిరుపతి – వర్ధన్నపేట
-
నాందేడ్ – విజయవాడ
షెడ్యూల్ వివరాలు:
ఏప్రిల్ 24, అనగా నేడు (శుక్రవారం) నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వీసులు మే మొదటి వారం వరకు వివిధ తేదీల్లో కొనసాగుతాయి. అయితే, ఈ ప్రత్యేక రైళ్లలో కొన్ని రూట్లలో ఒక ట్రిప్ మాత్రమే ఉండగా, మరికొన్ని రూట్లలో రెండు ట్రిప్పులు నిర్వహించనున్నారు. ముఖ్యంగా తిరుపతి – వర్ధన్నపేట మార్గంలో పలు తేదీల్లో రెండు వైపులా సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
